Telangana lockdown timings: తెలంగాణ లాక్‌డౌన్ టైమింగ్స్‌లో సడలింపులు

Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Last Updated : Jun 10, 2021, 06:59 AM IST
Telangana lockdown timings: తెలంగాణ లాక్‌డౌన్ టైమింగ్స్‌లో సడలింపులు

Telangana lockdown timings latest updates: హైదరాబాద్: తెలంగాణలో జూన్ 10 నుంచి మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో సర్కారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి లాక్‌డౌన్ వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి.  

Lockdown timings changed: లాక్‌డౌన్ వేళల్లో మార్పులు 
నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్‌డౌన్ సడలించి, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఒక గంట పాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉండనుంది.

Also read : HMRL timings, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లో మార్పులు

కరోనా తగ్గని నియోజకవర్గాల్లో లాక్ డౌన్ సడలింపులు లేవు
సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి రాకపోవడంతో ఆయా నియోజకవర్గాల పరిధిలో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పై నియోజకవర్గాల్లో లాక్‌డౌన్ వేళల్లో మార్పులు లేకుండా యధావిధిగా కొనసాగించాలని మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో (Telangana cabinet meeting important points to know) మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

Also read: TS inter second year exams: తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై మరో ప్రకటన

Also read: Good news for farmers: రైతులకు గుడ్ న్యూస్.. ఖరీఫ్ పంటలకు MSP పెంచిన కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News