Indian Covid-19 Variants B.1.617.1 And B.1.617.2 | భారత్‌లో తొలిసారి గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా, కరోనా వేరియంట్లు B.1.617.1 మరియు B.1.617.2 ఇండియాలోనే మొదటగా గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) మరోసారి స్పష్టం చేసింది. ఈ రెండు కోవిడ్19 వేరియంట్లకు కప్పా మరియు డెల్టా అని నామకరణం చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కోవిడ్19 సాంకేతిక విభాగం చీఫ్ మరియా వాన్ కెర్‌ఖోవ్ కరోనా వేరియంట్ల పేరును ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శాస్త్రీయంగా ఇదివరకే పెట్టిన పేర్లను మార్చడం జరగదని, అయితే కరోనా వైరస్ (CoronaVirus) వేరియెంట్లను సులువుగా గుర్తించేందుకు నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వేరియంట్లకు నామకరణం చేయడం అనేది ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వేరియంట్లకు ఐక్యరాజ్యసమితి ఆరోగ్య విభాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్19 వేరియంట్లు B.1.617.1కు కప్పా అని, B.1.617.2కు డెల్టా అని నామకరణం చేసింది.
Also Read: Anandaiah Ayurvedic Medicine: ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
Today, @WHO announces new, easy-to-say labels for #SARSCoV2 Variants of Concern (VOCs) & Interest (VOIs)
They will not replace existing scientific names, but are aimed to help in public discussion of VOI/VOC
Read more here (will be live soon):
https://t.co/VNvjJn8Xcv#COVID19 pic.twitter.com/L9YOfxmKW7— Maria Van Kerkhove (@mvankerkhove) May 31, 2021
మరోవైపు భారత్ వేరియంట్లు అని అనడంపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే B.1.617 కరోనా వేరియంట్‌ను తమ డాక్యుమెంట్స్‌లో ఎక్కడా ఇండియన్ వేరియంట్ అని ప్రస్తావించకుండా, భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్ (White fungus cases in Delhi) అని ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఆ కరోనా వేరియంట్ భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్ అని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
Also Read: Black Fungus Target: బ్లాక్ ఫంగస్ ఎవర్ని..ఏ వయస్సువారిని టార్గెట్ చేస్తుందంటే
ఎలాంటి ఆధారాలు లేకుండా భారత వేరియంట్ అని మీడియా రిపోర్ట్ చేసిందని, అది సరికాదని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో ఇటీవల ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గ్రీకు భాష అక్షరాలు ఆల్ఫా, బీటా, ఘామా నుంచి కోవిడ్-19 (COVID-19) వేరియంట్లకు నామకరణం చేసినట్లు డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు తెలిపారు. భారత్‌లో తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1,27,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా బాధితుల సంఖ్య 2,81,75,044 (2 కోట్ల 81 లక్షల 75 వేల 044)కు చేరుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook