Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఈ 26 నుంచి జారీ

TTD to resume Sarva Darshan Tokens | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు.

Last Updated : Oct 25, 2020, 05:25 PM IST
Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు ఈ 26 నుంచి జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తురు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala)లో శ్రీవారి దర్శనానికి ఇచ్చే సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. ప్రతిరోజు మూడు వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి తెలిపింది. 

 

ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికే అలిపిరి నుంచి కొండపైకి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించారు. దాదాపు 2 నెలలు విరామం తర్వాత సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్లు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. 

 

ఇంద్రకీలాద్రిపై ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
మరోవైపు కృష్ణా జిల్లా విజయవాడలోని కనకదుర్గమ్మ సన్నిధి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. దుర్గ గుడిలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. నేటి (అక్టోబర్ 25న) సాయంత్రం కృష్ణానదిలో హంస వాహన సేవ నిర్వహిస్తారు. నేడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారిని అలంకరించారు, రేపు కూడా అమ్మవారు అదే అలంకరణలో ఉంటారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News