వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనే డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ అరుదైన ఘనత సాధించారు. ఇప్పటివరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల రికార్డులను ఆయన తిరగరాశారు. ఎన్నికల ముందే ఘనత ఏంటని ఆలోచిస్తున్నారా.. ఎన్నికల ప్రచారం కోసం ఆయన చేసిన ఖర్చులతో రికార్డు నమోదైంది. ఎన్నికల్లో అత్యధిక మొత్తం ఖర్చు చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా జో బిడెన్ నిలిచారు. శుక్రవారం నాడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
ప్రస్తుతం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ గతేడాది ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి టెలివిజన్ ప్రకటనల కోసం 582 మిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకూ ఏ అభ్యర్థి అంత మొత్తంలో ప్రకటనలకు ఖర్చు చేయలేదట. ది హిల్ న్యూస్ వెబ్‌సైట్ ఈ విషయాలు రిపోర్ట్ చేసింది. గత వారం 45 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
బిడెన్ బృందం నవంబర్ 3న ఎన్నికల నేపథ్యంలో చివరి 10 రోజులలో మరో 57 మిలియన్ డాలర్లు ప్రకటనల కోసం కేటాయించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రచారం కోసం గత రెండేళ్లలో 342 మిలియన్ డార్లు ఖర్చు చేశారని సమాచారం. కేవలం గత ఏడు రోజుల్లో టెలివిజన్ మరియు డిజిటల్ ప్రకటనలలో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులు 160 మిలియన్ డాలర్లు వెచ్చించడం గమనార్హం.
ట్రంప్, బిడెన్‌లు వారి మద్దతుదారులు అక్టోబర్ ప్రారంభం నుంచి వారానికి 100,000 ప్రకటనలు ఇచ్చారని వెస్లెయన్ మీడియా ప్రాజెక్టు లెక్కలు వెల్లడించింది. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అత్యధిక సీట్లు సాధించిన ఫీనిక్స్, అరిజోనా, షార్లెట్, నార్త్ కరోలినా, డెస్ మొయిన్స్, అయోవాలలో అధిక మొత్తంలో ప్రకటనలకు ఇరు పార్టీలు వెచ్చించాయి. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe