fake recommendation letters intha name of satya kumar Yadav: ఏకంగా మంత్రిపేరుతో సిఫారసులు వస్తుండటంతొ టీటీడీ అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో దీనిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
Tirumala Temple: తిరుమల శ్రీవారికి చాలా మంది భక్తులు ప్రతిరోజు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆపదల్ని, గండాలను తొలగిస్తాడని నమ్ముతారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన నిలోఫర్ టీ దుకాణం యజమాని బాబు రావు శ్రీవారికి బంగారం, డైమండ్ తో చేసిన యజ్ఞోపవీతంను కానుకగా సమర్పించాడు.
Sai Durga Tej Announcement Of His Marriage: తన పెళ్లిపై డిప్యూటీ సీఎం మేనల్లుడు, నటుడు సాయి ధరమ్ తేజ్ కీలక ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. సోమవారం ఉదయం నైవేద్య విరామంలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. సినీ నటీనటులు ప్రియదర్శి, నందిత కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
Ttd key update on February month arjitha seva: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి మాసంకు సంబంధించిన స్వామివారి దర్శనం కోటాను విడుదల తేదీలను ప్రకటించింది.
Tirumala Devotees Meets Car Accident: తిరుమలలో తృటిలో ప్రమాదం తప్పింది. రెండో ఘాట్‌లో కారు ప్రమాదానికి గురవగా.. తమిళనాడుకు చెందిన భక్తులు గాయపడ్డారు. గాయపడిన భక్తులను తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్‌లో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు చేస్తున్నా అవగాహన లేకుండా అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారని పోలీసులు తెలిపారు.
Women Cricketer Sri Charani Tirumala Foot Step: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచకప్ విజేత, మహిళా క్రికెటర్ శ్రీ చరణి అలిపిరి మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుమల చేరుకున్నారు. రేపు ఉదయం స్వామిని దర్శించుకోనున్నారు. ప్రపంచ క్రికెట్‌లో సత్తాచాటి తెలుగు వారి గౌరవాన్ని పెంచిన శ్రీచరణికి ఇటీవల ఏపీ ప్రభుత్వం భారీ కానుకలు ఇచ్చిన విషయం తెలిసిందే.
Bellamkonda Srinivas Visits Tirumala Vadapalli Temple: కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అతడికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
Bellamkonda Srinivas Temple Tour: కోనసీమలో కొలువుదీరిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయ మహాత్యాన్ని వివరించాడు. ఏడు వారాలు, ఏడు ప్రదక్షిణల చేస్తే అనుకున్నది జరిగే ఆలయంగా భక్తుల నమ్మే వాడపల్లి గోవిందుడి క్షేత్రానికి రావడం సంతోషంగా ఉందని నటుడు శ్రీనివాస్ వెల్లడించాడు.
Tirumala Temple: కలియుగ దైవం తిరుమల శ్రీవారిని పలువురు సెలబ్రీటీలు, రాజకీయ నేతలు దర్శించుకున్నారు. ఉదయం పూట వీఐపీ బ్రేక్ సమయంలో నటి అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు రాజకీయ నేతలు మంత్రి పార్థసారథి,పీవీఎన్ మాధవ్ తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులుప్రత్యేకంగా వీఐపీలకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
Ayyappa devotees protest in Tirumala: కపిల తీర్ధం వద్ద వందలాదిగా అయ్యప్ప స్వాములు నిరసనలకు దిగారు. తమకు ఎందుకు పుణ్యస్నానాలకు అనుమతించరని వాగ్వాదంకు దిగారు. దీంతో అక్కడ గందర గోళం ఏర్పడింది.
Pawan kalyan on Tirumala laddu row:తిరుమల శ్రీవారి లడ్డూ కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదని, అది మనందరి ఉమ్మడి భావోద్వేగమంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. స్వామివారి ప్రసాదాన్ని.. స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి అపరిచితులతో కూడా మనం ఆ ప్రసాదాన్ని పంచుకుంటామన్నారు.
Tirumala Video: తిరుమల పవిత్ర పుణ్య క్షేత్రానికి మొక్కులు తీర్చుకోవడానికి నడిచి వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీలో పనిచేసే ఉద్యోగులు ఎండు చేపలు (కారవాడి) పులుసును తింటూ కనిపించారు. భక్తులు ఆ వాసన చూసి అభ్యంతరం చేశారు. ఉద్యోగులు అయి ఉండి ఇలా మాంసాహార వంటలు తెచ్చుకొని తింటారా..? అని మండిపడుతున్నారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భక్తులు. విషయం తెలుసుకున్న టీటీడీ.. ఔట్ సోర్సింగ్‌లో పని చేసే రామస్వామి, సరసమ్మ ఉద్యోగులను తొలగించింది. వారిద్దరిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.
Tirumala Vaikunta dwara darshanam: జనవరి 8వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. అదే విధంగా దర్శనానికి సంబంధించిన ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టోకెన్ల జారీ విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Big python in Tirumala Video: భారీ కొండ చిలువ తిరుమలలో ఘాట్ రోడ్డు దాటుతుంది.ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఘాట్ రోడ్లలో వెళ్లాలన్నారు. ముఖ్యంగా నడక మార్గంలోని భక్తులు జాగ్రత్తగా తిరుమలకు వెళ్లాలన్నారు.
leopard attacks on devotees in Tirumala: తిరుమలలో ముఖ్యంగా నడక మార్గంలో ఇటీవల చిరుత దాడులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అధికారులు ఇక మీదట.. సీసీకెమెరాతో నిరంతరం మానిటరీంగ్ చేస్తామన్నారు.
Nara rohith and sireesha couple: కొత్త జంట నారా రోహిత్ తన సతీమణి శిరీషతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకున్నారు.
Ysrcp leaders fires on kasibugga incident: కాశీ బుగ్గ ఘటనపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. ఈ క్రమంలో ఇది ఏదో యాదృచ్చికంగా జరిగిన అంశం కాదన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చంద్రబాబు పెట్టుకున్నారని వైసీపీ కీలక నేత పోతిన వెంకట మహేష్ ఎద్దేవా చేశారు.
Tirumala Video: మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో శేషాచల కొండలు పచ్చదనంతో సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం జలపాతం కనువిందు చేస్తోంది. ఎత్తైన కొండలపై నుంచి పాల నురుగులా దూకుతున్న జలపాతాల హొయలు మంత్రముగ్దులను చేస్తున్నాయి. మోకాళ్ళ మెట్టు సమీపంలోని అక్కగార్ల గుడి దగ్గర ఎత్తైన బండరాళ్ళపై నుంచి జాలువారుతున్న జలధారలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ వర్షాలతో శేషాచల కొండలలో సెలయేర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో వైపు మేఘాలు దిగి నేలకి వచ్చినట్టు భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. తిరుమల వెళ్లే భక్తులు ఈ దృశ్యలు చూసి మైమరచిపోతున్నారు.
Pushpa yagam in Tirumala: తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ మరోసారి కీలక అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఈ కింది విషయాల్ని భక్తులు గమనించాలని కోరింది. రెండు రోజుల పాటు పలు ఆర్జీత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.