Vijayawada Railway station: కాదేదీ అమ్మకానికి అనర్హం. ఇండియన్ రైల్వేకు ఇది అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఏకంగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి సిద్ధం చేసింది రైల్వే శాఖ. రీ డెవలప్‌మెంట్ పేరిట 99 ఏళ్ల లీజుకిచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
Ap Corona virus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్టే రాష్ట్రంలో సైతం కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా..వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకి..పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
Rains in ap: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మండ వేసవి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. దక్షిణ బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో పదిరోజుల పాటు అకాల వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉంది.
Ramadan Wishes: ముస్లింల పవిత్ర నెల రంజాన్ ప్రారంభమైంది. రంజాన్ నెల ప్రారంభం సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు అందించారు.
Ambati Rambabu: తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతే అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు.
Ugadi Panchangam 2021: ఉగాది నాడు జాతకం చెప్పించుకోవడం ఓ ఆనవాయితీ. అందుకే ఉాగాది నాడు పంచాంగ శ్రవణం క్రమం తప్పకుండా ఉంటుంది. ఆ స్వామీజీ చెప్పిందాని ప్రకారం కేసీఆర్, వైఎస్ జగన్‌లకు చాలా బాగుంటుంది కానీ ఆ నేతకు మాత్రం కష్టాలేనట. ఇంతకీ ఎవరా నేత..
Ugadi Prayers: తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటైన ఉగాది ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.
Chandrababu Naidu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారమంతా అసహనంతో, నిర్వేదనతో సాగింది. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మందుబాబులంతా తనకే ఓటేయాలని పిలుపునివ్వడం విశేషం.
Navaratnalu Calendar Release: దేశంలోనే అత్యధికంగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏ నెలలో ఏ పధకాల అమలు చేస్తున్నారనేది ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేకంగా నవరత్నాలు క్యాలెండర్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
Ugadi Happy New Year: తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది. తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేసి ఆకట్టుకున్నారు.
AP Coronavirus: సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం వణికిపోతోంది. ప్రతీరోజూ రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కల్గిస్తోంది.
Rains in ap: ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నడి వేసవిలో వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Pawan Kalyan In Home Quarantine : ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో పలువురు కోవిడ్19 బారిన పడ్డారు. దీంతో డాక్టర్ల సూచనతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.
AP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సి రామచంద్రయ్య..తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమ హయాంలో జరిగిన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tirupati Bypoll: పెరుగుతున్న కోవిడ్ కేసులు, ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ముఖ్మమంత్రి వైఎస్ జగన్ తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకున్నారు. వేలాదిగా జనం హాజరయ్యే పరిస్థితిని తప్పించేందుకే సభ రద్దు చేసుకున్నట్టు జగన్ స్పష్టం చేశారు.
Ap Vaccination: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి అదనంగా కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
AP Parishad Election 2021 Live Updates: మొత్తం 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేటి ఉదయం 7 గంటలకు ఏపీ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు నేటి ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
AP ZPTC And MPTC Elections | హై కోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఏపీలో పరిషత్ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
AP Parishad Elections 2021 | ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ప్రస్తుతానికి ఏపీలో పరిషత్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మేజర్ ఎన్‌కౌంటర్ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.