ధోనీ రికార్డును ఈజీగా బద్దలుకొట్టిన ఇయాన్ మోర్గాన్

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు (Eoin Morgan breaks MS Dhoni Most Sixes)ను సునాయాసంగా బద్దలుకొట్టేశాడు మోర్గాన్.

Last Updated : Aug 5, 2020, 01:10 PM IST
ధోనీ రికార్డును ఈజీగా బద్దలుకొట్టిన ఇయాన్ మోర్గాన్

Eoin Morgan breaks MS Dhoni's Most Sixes record As A captain  | ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మోర్గాన్ (Eoin Morgan Most Sixes Captain) నిలిచాడు. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 212వ సిక్స్ బాదిన మోర్గాన్.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అత్యధిక సిక్సర్ల( కెప్టెన్‌గా 211 సిక్సర్ల) రికార్డు (Eoin Morgan breaks MS Dhoni Sixes Record) ను అధిగమించాడు. తద్వారా కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా ఇయాన్ మోర్గాన్ అవతరించాడు.  MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువీ

ఓవరాల్‌గా కెరీర్‌లో ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) 328 అంతర్జాతీయ మ్యాచ్ సిక్సర్లు బాదాడు. అందులో కెప్టెన్‌గా 212 సిక్సర్లు కొట్టి కెప్టెన్‌గా ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడయ్యాడు. అయితే కెప్టెన్‌గా ధోనీ 332 మ్యాచ్‌లలో 211 సిక్సర్లు కొడితే.. ఇయాన్ మోర్గాన్ కేవలం 163 మ్యాచ్‌లలో 212 సిక్సర్లు సాధించడం విశేషం. ధోనీ మ్యాచ్‌లలో దాదాపు సగం మ్యాచ్‌లలో ఆ ఫీట్ అందుకుని రికార్డులు తిరగరాశాడు. IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్‌, బీసీసీఐ దారెటు?

ఓవరాల్‌గా చూస్తే.. ధోనీ కెరీర్‌లో 359 బంతులను సిక్సర్లుగా మలచగా.. మోర్గాన్ 328 సిక్సర్లు బాదాడు. త్వరలోనే ఈ రికార్డును ఇంగ్లాండ్ తిరగరాసేందుకు సిద్ధంగా ఉన్నాడు. 

కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్ల వీరులు..

  • ఇయాన్ మోర్గాన్ 212 సిక్సర్లు
  • ఎంఎస్ ధోనీ 211 సిక్సర్లు
  • రికీ పాంటింగ్ 171 సిక్సర్లు
  • బ్రెండన్ మెకల్లమ్ 170 సిక్సర్లు

కాగా, మంగళవారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఇయాన్ మోర్గాన్ అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా నిలిచాడు. కానీ ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఐర్లాండ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌కు షాకిచ్చి విజయాన్ని అందుకుంది. వన్డే సిరీస్‌ను 2-1తో ముగించింది.  BCCI: అవమానించినా ఆశ్చర్యపోలేదు: యువరాజ్ సింగ్ 
 పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

Trending News