IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్‌, బీసీసీఐ దారెటు?

IPL 2020కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో BCCI తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Last Updated : Jul 28, 2020, 04:31 PM IST
IPL 2020: క్రికెటర్ల వెంట లవర్స్‌, బీసీసీఐ దారెటు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)కు ఎట్టకేలకు లైన్ క్లియర్ కావడంతో నిర్వహణ పనుల్లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తలమునకలైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొత్త నిబంధనలతో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ ఈ నేపథ్యంలో స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)పై, ఆటగాళ్ల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఆటగాళ్ల సెక్యూరిటీ లాంటి పెద్ద విషయాల కన్నా చిన్న విషయాలు ఇప్పుడు బోర్డుకు తలనొప్పిగా మారాయి. BCCI: సౌరవ్ గంగూలీ దాదాగిరి ముగిసిందా?

యూఏఈకి వెళ్లనున్న ఐపీఎల్ ఆటగాళ్లతో పాటు వారి భార్య, ప్రియురాళ్లను బయో బబుల్ సర్కిల్‌లోకి తీసుకురావాలా.. వద్దా అని తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి సమయంలో ఏ జన సందోహం లేకుండా జరిగే మ్యాచ్‌లు కనుక ఆటగాళ్లతో పాటు సతీమణులు, లవర్స్‌కు కూడా అనుమతించాలని కొన్ని ఫ్రాంచైజీలు పట్టుబడుతున్నాయి. కనీసం భార్యను అయినా అనుమతించాలని, కొందరైతే లవర్స్‌ను కూడా అనుమతించాలని బోర్డును కోరుతున్నారట. BCCI అవమానించినా ఆశ్చర్యపోలేదు: Yuvraj Singh

ఆటగాళ్ల ఆరోగ్యం, ఇతరత్రా కారణాలతో వారి వెంట ఎవరినీ అనుమతించవద్దని మరికొన్ని ఫ్రాంచైజీలు బోర్డును కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆటగాళ్లతో పాటు భార్య, కుటుంబాన్ని అనుమతిస్తే.. మూడేళ్లలోపు పిల్లల సంరక్షణ బాధ్యత ఎలా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యలో వీరు షాపింగ్‌లకని వెళ్తే వీరి ఆరోగ్యంపై బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీసీఐ త్వరలోనే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌‌పై నిర్ణయం తీసుకుని ఫ్రాంచైజీలను గైడ్ చేయనుంది. పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్

కాగా, సెప్టెంబర్ 19న ఐపీఎల్ 20 ప్రారంభం కానుంది. నవంబర్ 8న ఐపీఎల్ 2020 ఫైనల్ నిర్వహించనున్నట్లు చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు. సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x