Pregnant Before Marriage: పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...

  • Jul 31, 2020, 16:31 PM IST

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే పెళ్లి అవకుండానే బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిక్ (Natasa Stankovic) పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో పెళ్లికి ముందే గర్భం దాల్చిన సెలబ్రిటీల వివరాల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం దాట్చిన టాప్ సెలబ్రిటీలు (Celebrities Got Pregnant Before Marriage) వివరాలపై ఓ లుక్కేయండి.

1 /10

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అయితే పెళ్లి అవకుండానే బాలీవుడ్ నటి నటాషా స్టాన్‌కోవిక్ (Natasa Stankovic) పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో పెళ్లికి ముందే గర్భం దాల్చిన సెలబ్రిటీల వివరాల కోసం నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. పెళ్లికి ముందే గర్భం దాట్చిన టాప్ సెలబ్రిటీలు (Celebrities Got Pregnant Before Marriage) వివరాలపై ఓ లుక్కేయండి. (Image Credit: Instagram/Natasa Stankovic)

2 /10

‘కింగ్’ నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కున మెరిసిన నటి గాబ్రియెల్లా డెమిట్రియడెస్ (Gabriella Demetriades). బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ చిన్నారికి జన్మనిచ్చింది. (Image Credit: Instagram/Gabriella Demetriades)

3 /10

దక్షిణాదిన పెద్ద సినిమాలలో నటించింది బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ (Amy Jackson). తన బాయ్ ఫ్రెండ్‌ జార్జ్ పనయోటోతో నిశ్చితార్థం విషయాన్ని వెల్లడించిన తర్వాత తాను గర్భం దాల్చానని (Actress Who Got Pregnant Before Marriage) చెప్పి గతంలో షాక్ ఇచ్చింది అందాల అమీ జాక్సన్. ఇంకా వివాహం కాలేదు. (Image Credit: Instagram/Amy Jackson)

4 /10

శ్రీదేవి (Actress Sridevi), బోనీ కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ బోనీకపూర్‌కు అదివరకే పెళ్లి కావడంతో వివాదమైంది. మరోవైపు పెళ్లికి ముందే శ్రీదేవి గర్భం (Actress Who Got Pregnant Before Marriage) దాల్చింది. బోనీతో పెళ్లి సమయానికి శ్రీదేవి 7 నెలల గర్భిణి. రెండు నెలల తర్వాత జాన్వీ కపూర్‌ పుట్టింది. (Image Courtesy: PTI)

5 /10

మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి నేహా దూపియా (Neha Dhupia) గర్భం దాల్చిన తర్వాత అంగద్ బేడీని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఓ బేబీకి జన్మనిచ్చింది. హ్యాపీగా ఉంది. (Image Credit: Instagram/Neha Dhupia)

6 /10

ఆస్ట్రేలియా నటి, మోడల్ అయితన లిసా హెడెన్ బ్రిటన్ వ్యాపారవేత్తను 2016 అక్టోబర్‌లో వివాహం చేసుకుంది. 2017 మే నెలలో ఓ బాబుకు జన్మనిచ్చింది. (Image Credit: Instagram/Lisa Haydon)

7 /10

బాలీవుడ్ నటి అమృతా అరోరా (Amrita Arora), వ్యాపారవేత్త ప్యూ షకీల్ లడఖ్‌ను వివాహం చేసుకుంది. అయితే అంతకుముందే వీరి ప్రేమకు ప్రతిరూపాన్ని నటి అమృతా తన కడుపులో మోస్తోంది (Actress Who Got Pregnant Before Marriage). పెళ్లితో అంతా సద్దు మణిగింది. (Image Credit: Instagram/Amrita Arora)

8 /10

అగ్రనటుడు కమల్ హాసన్, నటి సారికలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి సమయానికి పెద్ద కూతురు శ్రుతి హాసన్ రెండేళ్ల పాప. కొన్నేళ్ల తర్వాత కమల్, సారిక విడాకులు తీసుకోవడం తెలిసిందే. (Image Credit: Instagram)

9 /10

నటి కొంకనా సేన్ (Konkona Sen Sharma), ద లైఫ్ ఇన్ మెట్రో ఫేమ్ రణవీర్‌తో చాలాకాలం డేటింగ్ చేసింది. ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత వీరు రహస్యంగా వివాహం చేసుకున్నారు. (Image Credit: Instagram/Konkona Sen Sharma)

10 /10

విండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ (Viv Richards)తో డేటింగ్ చేయడంతో బాలీవుడ్ నటి నీనా గుప్తా (Nina Gupta) గర్భం దాల్చారు. భార్యతో రిచర్డ్స్ విడాకులు తీసుకోకపోవడంతో నీనా గుప్తా.. మసబా గుప్తాకు జన్మనివ్వడంతో పాటు సింగిల్ మదర్‌గా పెంచి పెద్ద చేశారు. మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (Image Credit: Instagram/Nina Gupta)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x