TS-bPass fake website: ఇంటి నిర్మాణం కోసం అప్లై చేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త మరి

Tsbpass fake website: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వివిధ రకాలుగా వివిధ వర్గాల వారిని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇళ్లు నిర్మించుకునేవారిని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Last Updated : Jan 18, 2021, 02:43 PM IST
TS-bPass fake website: ఇంటి నిర్మాణం కోసం అప్లై చేస్తున్నారా..తస్మాత్ జాగ్రత్త మరి

TS-bPass fake website: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వివిధ రకాలుగా వివిధ వర్గాల వారిని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇళ్లు నిర్మించుకునేవారిని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

సైబర్ నేరం ( Cyber crime )..ఒక చోట కట్టడి చేస్తే మరోచోట మరో రకంగా ఉద్భవిస్తుంది. పోలీసులకు సైబర్ నేరాలే అతిపెద్ద సవాలుగా మారాయిప్పుడు. ఇప్పుడు మరో కొత్త రకం సైబర్ నేరం వెలుగులోకి వచ్చింది. గూగుల్ సెర్చ్ ఇంజన్ ( Google search engine ) ద్వారా నకిలీ వెబ్‌సైట్ బయటపడటమే దీనికి కారణం. అదేంటంటే..

సాధారణంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునేవారు అనుమతుల కోసం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ లేదా పంచాయితీకు దరఖాస్తు చేసుకుంటారు. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) టీఎస్బీపాస్ పోర్టల్ ( TS-bPass Portal ) సిద్ధం చేసింది. https://tsbpass.telangana.gov.in/. భవనాలు, లే అవుట్లకు ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం ఈ పోర్టల్ ద్వారా అప్లై చేయాలి. ఈ క్రమంలో దరఖాస్తుదారుడికి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేస్తుంటారు. 

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు దీనిపై దృష్టి సారించారు. ఓ ఫేక్ వెబ్‌సైట్ ( Fake website ) క్రియేట్ చేసి..దరఖాస్తుదారుల్ని తమ నకిలీ వెబ్‌సైట్ వైపుకు మళ్లిస్తున్నారు. సరిగ్గా అటువంటిదే ఓ వెబ్‌సైట్..http://10061994. xyz/ tsbpass2/ index.html క్రియేట్ చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తుచేసుకునేవారికి సంబంధించిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వివరాలు, ఫోన్ పే, గూగుల్ పే వివరాలు తెలుసుకుని ఎక్కౌంట్ కాజేసేందుకు ఈ నకిలీ వెబ్‌సైట్ సృష్టించారు.  

గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే ఒరిజినల్ పోర్టల్ కిందే ఈ నకిలీ పోర్టల్ ( Fake portal ) దర్శనమిస్తుంది. ప్రభుత్వ లోగోలు అన్నీ సరిగ్గా ఉండటంతో ప్రజలు ఈ నకిలీ వెబ్‌‌సైట్‌ను క్లిక్ చేసి మోసపోయే అవకాశాలున్నాయి.  అందుకే ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల ( Cyber crime police ) కు ఈ విషయమై ఫిర్యాదు అందింది. ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయమని గూగుల్ సంస్థ ( Google ) కు సమాచారం కూడా పంపించారు. ఫేక్ వెబ్‌సైట్ చూసి నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

Also read: Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News