Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత

ప్ర‌ముఖ తెలుగు సినీ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, మాజీ ఎమ్మెల్యే వి.దొర‌స్వామి రాజు క‌న్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2021, 10:51 AM IST
Doraswami Raju: టాలీవుడ్ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే దొరస్వామి కన్నుమూత

Doraswami Raju passes away | హైదరాబాద్: ప్ర‌ముఖ తెలుగు సినీ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, మాజీ ఎమ్మెల్యే వి.దొర‌స్వామి రాజు క‌న్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్‌ (Hyderabad) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. కొన్నిరోజులుగా చికిత్స పొందుతున్న దొరస్వామి.. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం తుదిశ్వాస ( Doraswami Raju passes away) విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

అయితే దొరస్వామి ఎన్నో (Tollywood) సూపర్ హిట్ చిత్రాలను నిర్మించడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్‌గాను రాణించారు. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. 1994లో నగరి నియోజకవర్గం (Nagari) నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా.. ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా, డిస్ట్రిబ్యూషన్‌ అండ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా కూడా దొర‌స్వామి (Doraswami Raju ) సేవలందించారు. Also Read: Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

దొరస్వామి.. (Telugu cinema) సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను నిర్మించారు. విజయ మల్లీశ్వరి కంబైన్స్‌ (VMC) పేరుతో డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను స్థాపించి దొరస్వామి తెలుగు సినీ పరిశ్రమలో సత్తాచాటారు. Also Read: Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News