Unknown Pneumonia: చైనా పొరుగు దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్

Kazakhstan Pneumonia: చైనాలోని వుహాన్ ( Wuhan City Of China ) నగరంలో పుట్టిన కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి మంది ఈ వైరస్ బారీన పడ్డారు. భారత దేశంలో రోజురోజుకూ వ్యాధి సంక్రమణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మరో బాంబు పేల్చింది.

Last Updated : Jul 10, 2020, 03:55 PM IST
Unknown Pneumonia: చైనా పొరుగు దేశాన్ని వణికిస్తున్న కొత్త వైరస్

Corona VirusOrigin: చైనాలోని వుహాన్ ( Wuhan City Of China ) నగరంలో పుట్టిన కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి మంది ఈ వైరస్ బారీన పడ్డారు. భారత దేశంలో రోజురోజుకూ వ్యాధి సంక్రమణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చైనా మరో బాంబు పేల్చింది. తమ పొరుగు దేశం అయిన కజకిస్థాన్‌లో గుర్తు తెలియని వ్యాధి ( Unknown Pneumonia In Kazakhstan ) వేగంగా పెరుగుతోంది అని తెలిపింది. గుర్తు తెలియని వైరస్ సోకడం వల్ల న్యూమెనియాతో జూన్ నెలలోనే 600 మరణించారని తెలిపింది. అన్‌నోన్ న్యూమోనియా ( ప్రస్తుతం ఈ వ్యాధికి ఉన్న పేరు ) వల్ల గత 6 నెలల్లో 1772 మంది చనిపోయారని చైనా తెలిపింది. Also Read :Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ

Unknown Pneumonia Is Deadlier Than Coronavirus:   కోవిడ్-19 ( Covid-19 ) కన్నాఈ వ్యాధి ప్రమాదకరమని తన దేశ వాసులను హెచ్చరించింది చైనా. ఈ మేరకు కజికిస్థాన్‌ ( Kazakhstan ) లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. అయితే చైనా ప్రకటనను కజకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది. ఈ వ్యాధికి వైరల్ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా, ఫంగల్  ఇన్‌ఫెక్షన్ ( Fungal Infections ) లక్షణాలతో పోలికలు ఉన్నాయని తెలిపింది. అయితే మరణాలకు కారణం ఏంటో తెలియడం లేదు అని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) ఈ విషయంపై రిపోర్ట్ అందించినట్లు అని కజికిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. ఇదేం కొత్త న్యూమోనియా కాదని ఆ దేశ ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

Trending News