#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

#5YearsforBaahubaliRoar: ప్రభాస్ ( Prabhas) హీరోగా రాజమౌళి ( Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali ) చిత్రం ఐదేళ్ల క్రితం ఇదే రోజు విడుదలైంది. దీని కోసం ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువ భాగాన్ని కేటాయించాడు. దాని ఫలితం కూడా ప్రభాస్‌కు దక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్‌ వచ్చింది. 

Last Updated : Jul 10, 2020, 01:37 PM IST
#5YearsforBaahubaliRoar: ఐదేళ్లు అయినా తగ్గని బాహుబలి క్రేజ్

Prabhas 20: ప్రభాస్ ( Prabhas) హీరోగా రాజమౌళి ( Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali ) చిత్రం ఐదేళ్ల క్రితం ఇదే రోజు విడుదలైంది. దీని కోసం ప్రభాస్ తన కెరీర్‌లో ఎక్కువ భాగాన్ని కేటాయించాడు. దాని ఫలితం కూడా ప్రభాస్‌కు దక్కింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఎంతగా అంటే జపాన్‌లో కూడా బాహుబలి (Baahubali in Japan ) ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడ్డాయి. ఇందులో నటించిన రానా ( Rana Daggubati ), సుబ్బరాజు, జపాన్‌ వెళ్లి అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. Also Read :Apsara Rani: అప్సరా రాణీ.. సోషల్ మీడియాను ఏలుతున్న కొత్త బ్యూటీ 

Baahubali Completes 5 Years: రాజమౌళి బాహుబలి సినిమాను ప్రకటించినప్పుడు అభిమానులు ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది అని ఫిక్స్ అయ్యారు. అనుకున్న విధంగానే బాహుబలి, బాహుబలి 2 రెండూ భారీ విజయాన్ని, నిర్మాతలకు అదిరిపోయే లాభాన్ని సంపాదించి పెట్టాయి.

బాహుబలి 1: Baahubali: The Beginning
బాహుబలి ఫస్ట్ పార్ట్ 10 జూలై 2015న విడుదలైంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం టోటల్ బడ్జెట్ రూ.180. ఈ మూవీ రూ.685 కోట్లు వసూలు చేసింది.

బాహుబలి 2:  Baahubali: The Conclusion
మరో వైపు బాహుబలి 2 ( Baahubali 2 ) చిత్రం 28 ఏప్రిల్ 2017 విడుదల అయింది. బాహుబలి తొలి పార్ట్ జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు పెరిగాయి. బహుబలి 2 బడ్జెట్ ( Baahubali Budget )కూడా పెరిగి మొత్తం రూ.250 కోట్లు అయింది. రెండవ భాగం రికార్డు స్థాయిలో రూ.1810 కోట్లు ( Baahubali Collections ) సంపాదించి ట్రెండ్ క్రియేట్ చేసింది. 

బాహుబలి రెండు చిత్రాలకు సంగీతం అందించిన కీరవాణి, నటించిన అనుష్క( Anushka Shetty ), తమన్నా ( Tamannaah Bhatia ), రానా, సుబ్బరాజు ( Subbaraju ) అందరూ బాహుబలి చిత్రంతో పాటు సినీ చరిత్రలో అద్భుతమైన సినిమాలో భాగంగా మిగిలిపోతారు. ఈ సినిమాను తెరకెక్కించిన రాజమౌళి, బాహుబలి పాత్రకు ప్రాణం పోసిన ప్రభాస్.. భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. ఐదేళ్లే కాదు.. మరో వందేళ్లు అయినా ప్రేక్షకుల మనసులో బాహుబలికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 

బాహుబలి తొలి భాగం విడుదలై సరిగ్గా ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా నేడు ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. దాని గురించి వివరాలు చదవడానికి క్లిక్ చేయండి...Prabhas 20 First Look: ప్రభాస్ 20 ఫస్ట్‌లుక్ విడుదల.. టైటిల్ అదే

 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x