Telangana Covid-19: 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

లంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది.

Last Updated : Oct 4, 2020, 10:20 AM IST
Telangana Covid-19: 2 లక్షలకు చేరువలో కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో శనివారం ( అక్టోబరు 3 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,949 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 10 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,99,276 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,163 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 1,70,212 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 27,901 మంది చికిత్స పొందుతున్నారు. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 51,623 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 3 వరకు రాష్ట్రంలో 32,05,249 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. అయితే నిన్న రాష్ట్రంలో అత్యధికంగా  జీహెచ్‌ఎంసీ పరిధిలో 291 కరో్నా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్‌‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 150 పాజిటివ్ కేసులు చొప్పున కేసులు నమోదయ్యాయి. 

telangana corona cases bulletin

Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

Trending News