Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

Last Updated : Oct 4, 2020, 09:44 AM IST
Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్

Bihar election 2020 - Tejashwi Yadav to lead alliance: పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్‌ 28, నవంబర్‌ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలని ఎన్డీఏ (BJP-JDU), మహాకూటమి యూపీఏ (Congress- RJD- Left) ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల కోసం మహాకూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఈ మహాకూటమికి రాష్ట్రీయ జనతాదళ్‌ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్‌ (Tejashwi Yadav) రథసారధిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శనివారం పాట్నాలో జరిగిన సమావేశంలో మహాకూటమి నాయకుడిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను కాంగ్రెస్, వామపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ, సీపీఎం నేతల మధ్య సీట్ల పంపకాల అనంతరం వారితో కలిసి తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు. Also read: Harthras Case: హత్రాస్‌ కేసును సీబీఐకి అప్పగించిన సీఎం యోగి

బీహార్‌లో ఉన్న 243 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీచేయనున్నట్లు తేజస్వి యాదవ్ ప్రకటించారు. మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌ 70, సీపీఐ(ఎంఎల్‌) 19, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో బరిలో దిగనున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే.. జేఎంఎం (JMM), వికాశ్‌షీల్‌ ఇషాన్‌ పార్టీ (VIP) ఆర్జేడీ కోటాలోనే పోటీచేయనున్నట్లు ప్రకటించారు. కానీ.. తమకు గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వలేదని వీఐపీ పార్టీ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్లు వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఈసారి రెట్టింపు సీట్లు కేటాయించారు. ఇదిలాఉంటే నవంబర్ 7న వాల్మీకి నగర్‌ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టనుంది. ఇదిలాఉంటే.. బీహార్‌లో బీఎస్పీకి ఎన్నికలకు ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్‌ బీఎస్పీ అధ్యక్షుడు భారత్‌ బింద్‌ పార్టీకి రాజీనామా చేసి తేజస్వీ యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరారు.  Also read: DC vs KKR: షార్జా స్టేడియంలో అంత ఈజీ కాదు: Shreyas Iyer

Trending News