Telangana Covid-19: రాష్ట్రంలో 35లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 10, 2020, 09:48 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో 35లక్షలు దాటిన కరోనా టెస్టులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. రాష్ట్రంలో కొన్నిరోజుల నుంచి నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. రెండు రోజుల నుంచి రెండువేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసులతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం కోరోనా నుంచి 2,072మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో ( అక్టోబరు 9 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,811 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,10,346 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,217 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి

రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 1,83,025 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం తెలంగాణలో 26,104 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 87.01 శాతం ఉండగా.. మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం 50,469 కరోనా టెస్టులు చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబరు 9వ తేదీ వరకు రాష్ట్రంలో 35,00,394 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. Also read: Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు

ఇదిలాఉంటే.. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 291 కరోనా కేసులు నమోదు కాగా..  మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 171, రంగారెడ్డి జిల్లాలో 131, నల్లగొండ జిల్లాలో 108, కరీంనగర్ జిల్లాలో 100 కేసుల చొప్పున నమోదయ్యాయి. Also read: Harthras Case: హత్రాస్ బాధిత కుటుంబానికి భారీ భద్రత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News