Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి

యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Last Updated : Oct 10, 2020, 09:20 AM IST
Ram Gopal Varma: ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపండి

Disha Movie - Disha Father approached High Court: యథార్థ సంఘటనలను సినిమాలుగా మరల్చడంలో దర్శకుడు రామ్ ‌గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) రూటే వేరు. ఆయన తీసే సినిమాలు ఎంత ఆసక్తిరంగా ఉంటాయో.. అంతే వివాదాల్లో చిక్కుకుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే 2019 నవంబ‌ర్‌లో తెలంగాణ హైదరాబాద్‌లో జరిగిన దిశ సంఘటన దేశ‌వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ (disha) పై అత్యాచారం, హత్య, ఆ తర్వాత నిందితుల ఎన్‌కౌంటర్.. ఈ యథార్థ సంఘటనల ఆధారంగా ‘దిశా ఎన్‌కౌంటర్’ (DISHA ENCOUNTER ) సినిమాను వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను సైతం వర్మ విడుదల చేశారు. ఈ క్రమంలో.. ‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను ఆపేలా కేంద్రప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. Also read: Ram Gopal Varma: ఆసక్తికరంగా దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

ప్రస్తుతం.. దిశ సంఘటన, ఆతర్వాత నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను నిర్మించడం సరికాదని, ఈ సినిమాను ఆ పాలంటూ.. బాధితురాలి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి విచారించారు. రామ్ గోపాల్ వర్మ నిర్మించే దిశా ఎన్‌కౌంటర్ సినిమాను ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌.. ఇప్పటివరకు ఎలాంటి వినతిపత్రం సమర్పించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వర్‌రావు నివేదించారు. అయితే.. దిశ తండ్రి ఇచ్చే వినతి పత్రంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, సెన్సార్‌ బోర్డును ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. Also read: Harthras Case: హత్రాస్ బాధిత కుటుంబానికి భారీ భద్రత

ఇదిలాఉంటే.. అంతకుముందు తెలంగాణ మిర్యాలగూడెంలో జరిగిన ప్రణయ్ పరువు హత్యపై రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమాను ఆపాలంటూ.. ప్రణయ్ కుటుంబసభ్యులు కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రణయ్ భార్య అమృత, ఆయన తండ్రి బాలస్వామి నల్లగొండ జిల్లా కోర్టులో సివిల్ పిటిషన్‌ దాఖలు చేయగా.. విచారించిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మర్డర్ సినిమాను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. దీన్నీ సవాలు చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా.. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. Also read: Vishal: ఆ నష్టాన్ని హీరో విశాల్ భరించాల్సిందే: మద్రాస్ హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News