తెలుగుదేశం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి షాక్ తగిలింది. ఏపీ మైనింగ్ అధికారులు జేసీ దివాకర్ రెడ్డికి భారీ జరిమానా విధించారు. ఒకటి కాదు రెండు  కాదు..ఏకంగా వంద కోట్ల జరిమానా అది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పటికే పలు కేసుల్లో ఇరుకున్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ( Ex mp jc diwakar reddy ) మెడకు మరో కేసు చిక్కుకుంది. అక్రమ మైనింగ్ కేసు ఇది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ( Ap mining department ) అధికారులు జేసీ దివాకర్ రెడ్డికు భారీగా జరిమానా విధించి షాక్ ఇచ్చారు. ఆ జరిమానా...పదో...ఇరవయ్యో లక్షలు కాదు సుమా. ఏకంగా వంద కోట్ల జరిమానా ( 100 crore penalty ) అది. వంద కోట్ల జరిమానా కట్టకపోతే..ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం ఆస్థుల్ని జప్తు చేస్తామని మైనింగ్ అధికారులు హెచ్చరించారు. 


జిల్లాలోని యాడికి మండలంలో అక్రమ తవ్వకాల ద్వారా 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్‌స్టోన్ (  limestone ) దోపిడీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. విలువైన లైమ్‌స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. ఇంట్లో పని చేసే మనుష్యులు, డ్రైవర్ల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు సైతం పొందారు. అనుమతులొచ్చిన తరువాత తిరిగి తమ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ చేయించుకున్నారు.


తెలుగుదేశం ప్రభుత్వ ( Telugu desam government ) హయాంలో అధికారాన్నిఅడ్డు పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు జేసీపై అనేక ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్ సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ అధికారులు చర్యలు కూడా తీసుకున్నారు. దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్  మైనింగ్ క్వారీల్లో సైతం అక్రమాలు జరిగాయని షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. Also read: AP: చంద్రబాబు అండ్ కో పై వైఎస్ జగన్ పంచ్‌లు వింటారా…