Street Dog In Revanth Reddy Vemulawada Tour: ఆకాశంలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ వద్దకు అకస్మాత్తుగా కుక్క దూసుకురావడంతో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. హెలికాప్టర్ వద్దకు వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందారు.
Alleti Maheshwar Reddy Slams To Revanth Reddy Celebrations: ఏడాది పాలన పేరిట రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంబరాలు వంచనోత్సవాలుగా బీజేపీ అభివర్ణించింది. ఏం ముఖంతో రేవంత్ వేడుకలు నిర్వహిస్తారని కాషాయ పార్టీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Harish Rao Says KCR Is Not Plant He Is Kalpavriksha: ఇచ్చిన హామీలపై దేవుళ్లపై ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మోసం చేశాడని.. అతడి డీఎన్ఏ అబద్దాలు ఆడడమే అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు విమర్శించారు. రుణమాఫీపై రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
CM Revanth Reddy Vs KCR: తాము పది నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. లెక్క తప్పితే క్షమాపణలు చెప్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని.. రుణమాఫీపై లెక్కలు చూపిస్తామన్నారు.
High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.
Dharmapuri Arvind Interview: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ధర్మపురి అరవింద్.. తాజాగా జీ మీడియా ఎడిటర్ భరత్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పార్టీలో నెలకున్న ఇతర అంశాలపై మాట్లాడారు.
Madhapur: హైదరాబాద్ గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్‌లో నాలుగు అంతస్తుల భవనం పక్కకు ఒరిగిన ఘటన స్థానిక ప్రజల్లో కలకలం రేపింది. వసుకుల లక్ష్మణ్ అనే వ్యక్తి ప్లాట్ నం. 1639లో 70 గజాల స్థలంలో జీప్లస్ ఫోర్ భవనాన్ని నిర్మించారు. ఫ్లోర్‌కు రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. తాజాగా ఈ భవనం ఒరిగిపోయిన ఘటన హైదరాబాద్ వాసుల్లో కలకలం రేపుతోంది.
Hyderabad Weather Update: చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Revanth Reddy: ఓ వైపు పక్క పార్టీ నేతలను ఆకర్షించే పనిలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర లేపిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఎందుకో ఈ విషయంలో సైలెంట్ అయ్యారు. ఓ వైపు పక్క నేతలను ఆకర్షించడంలో బిజీ అయిన రేవంత్ కు ఇపుడు సొంత పార్టీ నేతలే వరుస షాకులిస్తున్నారు. తాజాగా వరంగల్ జరిగిన సభలో రేవంత్ కు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి షాక్ ఇచ్చారు.
KTR: ఉచిత విద్యుత్ అంటూ ప్రజలపై పెద్ద భారం మోపడానికి రేవంత్ సర్కార్ రెడీ అవుతున్నట్టు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు త్వరలో ప్రజలపై పిడుగు లాంటి భారం మోపడానికి రెడీ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.అంతేకాదు అపార్ట్ మెంట్ లో ఉంటున్న ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపేందుకు రెడీ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు.
GO 16 Cancelled Telangana Contract Employees: క్రమబద్దీకరణ పొందిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అయిన ఏడాదిన్నర తర్వాత హైకోర్టు భారీ పిడుగు వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను హైకోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
Telangana Employees JAC: లగచర్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు. రైతులు చేసిన దాడి విషయంలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొడంగల్ రైతుల ఆందోళనలో ఉద్యోగులపై జరిగిన దాడిపై స్పందించాలని కోరారు.
Facial Recognition Attendance Starts From Nov 22nd To Secretariat Employees: రాష్ట్ర పరిపాలనా ప్రధాన కేంద్రం సచివాలయంలో ఉద్యోగులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులు హాజరు ఎంట్రీ.. ఔట్ తప్పనిసరి చేసింది. దీనికి ముఖ గుర్తింపు తప్పనిసరిగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Harish Rao Condemns Revanth Reddy Vulgar Comments: వరంగల్ సభలో రేవంత్ రెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ గుర్రుమంది. అతడు చేసిన దరిద్రపు వ్యాఖ్యలను ఖండించి రేవంత్ రెడ్డిపై గులాబీ దళం విరుచుకుపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.