USA terror attack: అమెరికాలో దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నవారిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మరో 30 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన న్యూ ఓర్లీన్స్ లోని కెనాల్, బోర్బన్ స్ట్రీట్ ల్ చోటుచేసుకుంది.
Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్ష పడింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత నర్స్ నిమిష ప్రియాకు ఆ దేశాక్షుడు మరణశిక్షను ఖరారు చేశారు. ఆ నర్సును విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది.
Ethiopia road accident: ఆఫ్రికాలోని ఇథియోపియాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ట్రక్కు 71 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Taliban seize Pakistani military base: పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ లోని ఖైబర్ పంఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని సలార్జాయ్ లో ఉన్న సైనిక స్థావరాన్ని టీటీపీ ఫైటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పాక్ వైమానిక దళం దాడి తర్వాత, ఇరుపక్షాల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
Israel- Syria: సిరియాపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. పారిశ్రామిక నగరమైన అద్రా సమీపంలోని అసద్ సైన్యానికి చెందిన ఆయుధాల డిపోను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మరోసారి భారీ దాడికి దిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
H1B Visa: విదేశీ ఉద్యోగులకు ముఖ్యంగా అగ్రరాజ్యంలో ఉద్యోగం చేసేవారికి కీలకమైన అప్డేట్ ఇది. హెచ్ 1బి వీసా ఫైలింగ్ విషయంలో మార్పు చోటుచేసుకుంది. యూఎస్ కొత్త ఫామ్ విడుదల చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Jimmy Carter: నోబెల్ అవార్డు గ్రహీత, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూశారు. ఆయన వయస్సు 100 సంవత్సరాలు . అనారోగ్య సమస్యలతో ఆయన జార్జియాలోని ప్లెయిన్స్ లో తుది శ్వాస విడిచారు. జిమ్మీ కార్టర్ మరణించినందుకు గౌరవసూచకంగా జనవరి 28, 2025 వరకు జెండా సగం స్టాఫ్‌లో ఉంటుంది. మాజీ అధ్యక్షుడికి అమెరికన్లు రుణపడి ఉంటారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జిమ్మీ కార్టర్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
South Korea Plane Crash Updates: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో క్రష్ అయింది. ఈ ఘటనలో 179 మంది మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Putin: అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పారు.
Tsunami 2004 Photos: హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అతిపెద్ద భూకంపం చరిత్రలో మరచిపోలేనిది. రిక్టారు స్కేలుపై 9.1 నమోదైంది. ఫలితంగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు తీసింది. దాదాపు 14 తీర ప్రాంత దేశాలు ప్రభావితం చెందాయి. ముఖ్యంగా ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిల్యాండ్పై ఎక్కువ ప్రభావం చూపింది.
Greenland: వచ్చేఏడాది జనవరిలో అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అధికార పగ్గాలు చేపట్టకుముందే తన ప్రణాళికలను దూకుడుగా అమలు చేస్తున్నారు ట్రంప్. ఇప్పటికే తన ప్రభుత్వంలో ఉండే అధికారులను, మంత్రులను నిర్ణయించుకున్న ట్రంప్..తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే తీసుకోబోయే నిర్ణయాలను కూడా వరుసగా వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా పనామా కాలువపై నియంత్రణ సాధిస్తామని ప్రకటించారు. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ దీవినీ కొనేసి తమ నియంత్రణలోకి తీసుకువచ్చుకుంటామని వెల్లడించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు డెన్మార్క్ ప్రధాని మాస్ వార్నింగ్ ఇచ్చారు.
Bill Clinton Health Status in Telugu: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆరోగ్యం విషమంగా మారింది. 78 సంవత్సరాలు వయస్సులో హెవీ ఫీవర్, కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన పరిస్థితి అప్పుడే చెప్పలేమని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Bangladesh Letter To India On Ex PM Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు భారీ షాక్ తగిలింది. తమ దేశానికి పంపించాలని భారత్‌కు బంగ్లాదేశ్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆమెను తిరిగి పంపించాలని విజ్ఞప్తి చేసింది.
IRAN: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఎలాంటి ప్రాక్సీ ఆర్మీ అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. తాము రంగంలోకి దిగితే ముసుగు సంస్థలతో అవసరం లేదని హెచ్చరించారు. అమెరికా కిరాయి మూకలుగా పనిచేస్తే అణివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
Aircraft Crashed In Gramado Of Brazil: గగనయానంలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జనావాసాలపై విమానం కుప్పకూలిపోవడంతో పది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ పారిశ్రామికవేత్త ఉన్నాడు. ఈ సంఘటనతో బ్రెజిల్లో తీవ్ర విషాదం ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.