9 Years Of PM Modi: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 9 ఏళ్లు పదవీక కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలనే ప్రత్యేక పథకాలను రూపొందించింది.
Big King Cobra Catch In Goa Beach: ప్రస్తుతం నెట్టింట కింగ్ కోబ్రాకు సంబంధించిన వైరల్ వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవలే గోవా బీచ్‌లో కోబ్రా సంచారం చేసిన వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ భారీ కోబ్రాను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
7th Pay Commission DA Hike: రాష్ట్ర ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచే వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. డీఏ పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
Operation Pink: పిపి జువెలర్స్, త్రిభువన్దాస్ భీమ్‌జి జవేరి జువెలర్స్ వంటి ఫేమస్ జువెలరీ షోరూమ్స్ ఈ చీకటి దందాలో పాల్పంచుకుంటూ బడా బాబులు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లు గోల్డ్ కాయిన్స్‌తో ఎక్స్చేంజ్ చేసుకునేందుకు సహకరిస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే... ఇప్పటివరకు రూ. 2 వేల నోట్ల కట్టలు పోగేసుకున్న బడా బాబుల వద్ద ఇప్పుడు ఆ నల్లధనం వైట్ అవుతోంది.
Jammu Kashmir Bus Accident: జమ్మూ కాశ్మీర్ లోని అదుపుతప్పి బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 8 మంది మరణించగా 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Chandrayaan 3: చంద్రయాన్ 3కు అంతా సిద్ధమైంది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్ 3 యాత్ర ఎప్పుడనేది ప్రకటించారు. పూర్తి వివరాలు మీ కోసం..
JEE Advanced 2023: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అంతా సిద్ధమైంది. ఐఐటీ గౌహతి నిర్వహిస్తున్న ఈ పరీక్ష అడ్మిషన్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది.
GSLV F12 Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయికి చేరుకుంది. జీఎస్ఎల్వి ఎఫ్ -12 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది ఈ రాకెట్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించగా.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్ఘాన్‌లో భూకంప తీవ్రతను రిక్టారు స్కేలుపై 5.2గా గుర్తించారు.
New Parliament Schedule: భారతదేశ కొత్త పార్లమెంట్ భవనం ఇవాళ ప్రారంభం కానుంది. దాదాపు వందేళ్ల పాత పార్లమెంట్ భవనం ఇవాళ్టితో మూగబోనుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న పార్లమెంట్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
New Parliament Building Inside Pics: అత్యాధునిక వసతులు, అద్భుతమైన డిజైన్‌తో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంతో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. పార్లమెంట్ భవనం లోపలి చిత్రాలు, ప్రత్యేకతలపై ఓ లుక్కేయండి..
Karnataka Ministers Portfolio: కర్ణాటక సీఎం సిద్దరామయ్య టీమ్ రెడీ అయింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో కలిపి మొత్తం 34 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. శనివారం 24 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులకు ముఖ్యమంత్రి శాఖలు కేటాయించారు.
Karnataka Cabinet: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వారం రోజులకు కేబినెట్ పూర్తి స్థాయిలో ఇవాళ విస్తరించనుంది. ఇవాళ మరో 24 మందికి కేబినెట్లో చోటు దక్కనుంది. పూర్తి స్థాయిలో ఏర్పడుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్లో ఎవరికి ఏ మేరకు ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం..
OLD Parliament History: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ వీడియో వైరల్ అవుతోంది. మరో రెండ్రోజుల్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. మరి పాత పార్లమెంట్ పరిస్థితి ఏంటి, ఎన్నేళ్ల చరిత్ర ఉందో తెలుసా ఎవరికైనా..
Unknown Facts About Narendra Modi: ప్రధాని మోడీ దేశానికి పెద్ద అయినా సాధరణ జీవితాన్ని గడపడాని ఇష్టపడతారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడతారని సమాచారం. ఈ రోజు ప్రధాని మోడీకి సంబంధించిన రహస్య వివారాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
Sanitary Napkins Vending Machines: ప్రభుత్వ కళాశాలల్లో బాలికల హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా నిర్ధేశించుకున్న ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తాం అని సంబంధిత అధికారులు తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు సేకరించి ఈ ప్రాజెక్టును నిర్వహించనున్నట్టు అధికారులు స్పష్టంచేశారు.
టెక్నాలజీ పరంగా చాలా ముందుకు వెళ్తున్న సమయం ఇది. డిజిటల్ ప్రపంచంలో ఎంతో ముందుకు వెళ్తున్న మన దేశంలో ఇప్పటికీ తాగటానికి కూడా నీళ్లు లేకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ వివరాలు..
7th Pay Commission DA Arrears: పంజాబ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 2015 నుంచి డిసెంబర్ 31, 2015 వరకు గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఆరు శాతం డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది.