Assembly Election 2021 Full Schedule live updates: న్యూఢిల్లీ: తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు 2021 షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా కొద్దిసేపటి క్రితమే ఈ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
New rules for social media, digital and OTT platforms: ఓటిటి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు తెలిపారు.
Bittu Srinu arrested in Vaman Rao murder case: పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హై కోర్టు అడ్వకేట్ దంపతులు వామన రావు, పి.వి. నాగమణిల హత్య కేసులో అరెస్ట్ అయిన బిట్టు శ్రీనును మంథని పోలీసులు ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
Advocates couple Vaman Rao, PV Nagamani Murder case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, నాగమణి హత్య కేసులో ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దుల్లోని వాంఖిడి-చంద్రపూర్ ప్రాంతంలో నిందితుల కదలికలు గుర్తించిన పోలీసులు అక్కడే వారిని అదుపులోకి తీసుకుని పెద్దపల్లికి తరలించారు.
Farmers protest against Minister Indrakaran Reddy: నిర్మల్: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ జల్లా పొన్కల్ వద్ద చేదు అనుభవం ఎదురైంది. శనివారం అక్కడ రైతు వేదిక ప్రారంభించేందుకు వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్‌ని రైతులు, సాధర్మాట్ భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. Sadarmat barrage ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ నుంచి భూములు లాక్కుని మూడేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు తమకు నష్టపరిహారం చెల్లించలేదని రైతులు నిరసన వ్యక్తంచేశారు.
Araku bus accident news: అరకు : విశాఖపట్నం జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి అరకు ఘాట్‌రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది.
Supreme court on local elections: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, ఉద్యోగ సంఘాలు దాఖలు చేసుకున్న పిటీషన్లను కొట్టివేసింది. ఈసీ వ్యవహారాల్లో కలగజేసుకోమని స్పష్టం చేసింది.
తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24గంటల్లో ఆదివారం (జనవరి 17న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కోవిడ్ మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కొన్ని రోజులనుంచి ప్రతిరోజూ 15 నుంచి 18 వేల కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. నిన్న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొత్తరకం కరోనావైరస్ కూడా భయాందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఈ స్టే (stays three farms laws) కొనసాగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
దేశంలో ఇటీవల కాలంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. నిత్యం 18వేలకు పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. సోమవారం 12వేలకే పరిమితమయ్యాయి.
దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.
Union Minister Shripad Naik injured in accident | కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ గాయపడగా, ఆయన భార్య, సమీప అనుచరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీపాద్ నాయక్ భార్య విజయ నాయక్, పీఏ దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ వాళ్లు తుదిశ్వాస విడిచినట్టు పోలీసులు నిర్ధారించారు.