AP 10th Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలవుతాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేస్తారు. ఈమేరకు విద్యా శాఖ డైరెక్టర్ దేవానంద్‌రెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో చూసే అవకాశం కల్పించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదట శనివారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని విద్యా శాఖ అధికారులు ప్రకటించారు. ఐతే కొన్ని కారణాల వల్ల ఫలితాలు వాయిదా పడ్డాయి. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గందరగోళం నెలకొంది. స్పందించిన విద్యా శాఖ సోమవారం ఫలితాలను విడుదల చేస్తామని..సాంకేతిక కారణాలతోనే ఫలితాలు విడుదల చేయలేకపోయామని వివరించారు. దీనిపై సీఎంవో సైతం ఆరా తీసింది.


అర్ధాంతరంగా పదో తరగతి ఫలితాల వాయిదాపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అయ్యాయి. ఉన్నట్టుండి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నిస్తున్నాయి. సీఎం జగన్‌ కోర్టు వాయిదాలకు అలవాటు పడ్డారని..అదే తరహాలోనే పదో తరగతి ఫలితాలను వాయిదా వేశారా అని టీడీపీ ప్రశ్నించింది. పరీక్షా ఫలితాలను చివరి నిమిషంలో ఎందుకు వాయిదా వేశారో చెప్పాలని డిమాండ్ చేసింది.


అసమర్థ పాలన వల్ల విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకుంటారా అని టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. మద్యం వ్యాపారం చేసుకునే వ్యక్తికి విద్యా శాఖ మంత్రిని చేశారని విమర్శించారు. సీఎం జగన్..అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం జగన్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు .


Also read: BJP Strategy: కమలనాథులకు ఆ ముచ్చట తీరుతుందా..? ప్రధాని మోదీ ఏమంటున్నారు..?


Also read: Delhi Weather: దేశ రాజధానిలో భానుడి ప్రతాపం..ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook