Billionaires in Rajya Sabha: రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలలో బిలియనీర్ల జాబితా చాలానే ఉంది. అందులో మన తెలుగు వారి సంఖ్యే అధికంగా ఉండటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. రాజ్యసభలో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు సంస్థలు అధ్యయనంలో తేలింది. అందులోనూ కేవలం తెలుగు రాష్ట్రాలకే చెందిన 18 మంది ఎంపీల ఆస్తుల మొత్తం విలువే ఏకంగా 9,419 కోట్ల రూపాయల వరకు ఉందని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు పేర్కొన్నాయి. ఎన్నికల అఫిడవిట్‌లో ఎంపీలు పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సంస్థలు వీరి ఆస్తులను లెక్కించినట్టు సమాచారం. ప్రస్తుతం వీళ్ల ఆస్తుల విలువ విషయానికొస్తే అంతకంటే ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు వెల్లడించిన నివేదిక ప్రకారం రాజ్యసభలో ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పదకొండు మంది రాజ్యసభ సభ్యులలో ఐదుగురు, అలాగే తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలలో ముగ్గురు శ్రీమంతులు ఉన్నారు. మహారాష్ట్ర నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న 19 మంది రాజ్యసభ సభ్యులలో ముగ్గురు బిలియనీర్లు ఉండగా.. ఢిల్లీ నుండి ముగ్గురు ఎంపీలలో ఒక బిలియనీర్ ఉన్నారు. పంజాబ్ నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీలలో ఇద్దరు బిలియనీర్స్ కాగా.. హర్యానా నుండి ఐదుగురిలో ఒకరు, మధ్యప్రదేశ్ నుండి పదకొండు మందిలో ఇద్దరు  చొప్పున బిలియనీర్ ఎంపీలు ఉన్నారు.


మొత్తానికి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు విడుదల చేసిన నివేదికలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల రాజ్యసభ సభ్యుల సంఖ్యే అధికంగా ఉండటంతో పాటు వీరి ఆస్తులే అధికంగా ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాలు ఈ విధంగా మరోసారి పతాక శీర్షికలకెక్కాయి. ఇందులో ఏపీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.3,823 కోట్లుగా ఉండగా.. తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఏడుగురు ఎంపీల ఆస్తుల మొత్తం విలువ రూ.5,596 కోట్లకు లెక్క తేలింది. 


మన తెలుగు రాష్ట్రాల నుండి 18 మంది రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తి విలువ రూ. 9 వేల కోట్లు దాటితే... దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర్ ప్రదేశ్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న 30 మంది రాజ్యసభ సభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.1,941 కోట్ల వరకు ఉండటం గమనార్హం. ఇదిలావుంటే, ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యు వెల్లడించిన ఈ సమాచారం చూసి నోరెళ్లబెట్టడం తెలుగు ప్రజల వంతు అవుతోంది.


ఇది కూడా చదవండి : Pawan Kalyan on Alliance With TDP and BJP: వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తులపై పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్


రాజ్యసభల ో తెలుగు వాళ్లు ఇంతమంది ధనికులు ఉండి కూడా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పట్టనట్టే ఎందుకు వ్యవహరిస్తారో అర్థం కావడం లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ తమ అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇటీవల దేశంలోనే ధనిక ఎమ్మెల్యేల జాబితా తీయగా.. అత్యధికంగా కర్ణాటక ప్రజాప్రతినిధుల పేర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లు ప్రముఖంగా ఉండటం తెలిసిందే.


ఇది కూడా చదవండి : Realme GT 5 Mobile Features: రియల్‌మి GT 5 ఫోన్.. స్మార్ట్ ఫోన్లకే స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి