AP Police: ఏపీ పోలీసుల ఘనత... దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీగా గంజాయి దహనం.. !
AP Police: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో గంజాయిని.. ఏపీ పోలీస్ శాఖ దహనం చేయనుంది. రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టి...గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపారు పోలీసులు.
Operation Parivartan in AP: గంజాయిని (Ganja) భారీ స్థాయిలో దహనం చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఇంత గంజాయిని (cannabis) దహనం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ (AP Police) ఆపరేషన్ పరివర్తన్ (Operation Parivartan) కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా...గంజాయి సాగుపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో భారీ స్థాయిలో గంజాయి తోటలను ధ్వంసం చేసింది.
విశాఖ మన్యంతోపాటు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా గంజాయి (Ganja) సాగు కొనసాగుతోంది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపింది పోలీస్ శాఖ. ఈ క్రమంలో పట్టుబడిన 2లక్షల కిలోల గంజాయిని శనివారం దహనం చేయనుంది. ఈ గంజాయి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఓ ఈవెంట్‌లా చేయనుంది పోలీస్ శాఖ. దీని కోసం టెంట్లు, స్పీకర్లు, డ్రోన్ కెమెరాలు వాడుతున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook