ఏపీలో 25 కొత్త కేసులు..!!
తెలుగు రాష్ట్రాల్లో `కరోనా వైరస్` విస్తృతి తగ్గడం లేదు. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వలస కూలీలు స్వరాష్ట్రానికి రావడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో 'కరోనా వైరస్' విస్తృతి తగ్గడం లేదు. రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వలస కూలీలు స్వరాష్ట్రానికి రావడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 230కు చేరుకుంది. అందులో 747 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు 50 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్క రోజే 25 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 14 వందల 33 మంది కరోనా వైరస్ కు చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు.
[[{"fid":"185729","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలులో మొత్తంగా 611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 187 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 405 మందిని సురక్షితంగా ఇంటికి పంపించారు. కర్నూలులోని వివిధ ఐసోలేషన్ సెంటర్లలో 19 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.
[[{"fid":"185730","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..