Dowleswaram Barrage: గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. గోదావరి చరిత్రలోనే జూలై నెలలోనే రికార్డ్ స్థాయిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. శనివరం మధ్యాహ్నం నుంచి భద్రచాలం దగ్గర గోదావరి తీవ్రత కాస్త తగ్గినా.. ధవళేశ్వరంలో మాత్రం మరో 24 గంటలు పాటు కొనసాగనుంది. శనివారం ఉదయం 11 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీకి 24.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. 1986 తర్వాత ధవళేశ్వరం దగ్గర 24 లక్షలకు పైగా ఇన్ ఫ్లో నమోదు కావడం ఇదే. జూలైలో ఇంతటి వరదలు ఎప్పుడు రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భద్రాచలంలో శనివారం ఉదయం దాదాపు 25 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఆ వరదతో పాటు శబరి నుంచి వచ్చే వరద ధవళేశ్వరం రానుంది. దీంతో మరో 24 గంటల వరకు ధవళేశ్వరానికి గోదావరి వరద మరింత పెరగనుంది. ప్రస్తుతం దవళేశ్వరంలో నీటిమట్టం 20.5 అడుగలకు చేరింది. ఆదివారం ఉదయానికి 22 అడుగులకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గనుంది. ధవళేశ్వరానికి మరో 24 గంటలు 25 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రానుండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ధవళేశ్వరం దగ్గర మూడో ప్రమాదక హెచ్చరిక కొనసాగుతోంది.


ధవళేశ్వరం దగ్గర వరద పరిస్థితిని అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన స్పెషల్ అధికారుతో పాటు ఏపీ విపత్తుల సంస్థ డైరెక్టర్ ధవళేశ్వరం దగ్గరున్న కంట్రోల్ రూంలోనే ఉండి పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. గోదావరి  వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరినప్పుడే కోనసీమ పరిధిలోని  6 జిల్లాల పరిధిలోని 44 మండలాలకు చెందిన 628 గ్రామాలు ముంపు భారీన పడ్డాయి. వరద 25 లక్షల క్యూసెక్కులకు చేరితో మరో రెండు వందల లంక గ్రామాలను వరద ముంచెత్తనుంది. దీంతో ముందస్తుగా ప్రభుత్వం మరిన్ని లంక గ్రామాలను ఖాళీ చేయించింది. సహాయక చర్యల కోసం అదనపు సహాయక బృందాలను రంగంలోకి దింపారు. 9 ఎన్డీఆర్‌ఎఫ్‌, 10 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు గోదావరి తీరంలో సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు రోజుల వరకు గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు సంస్థ హెచ్చరించింది.



Also Read: Godavari Floods LIVE: భద్రాచలం సేఫేనా? మరో నాలుగు గంటలు గడిస్తేనే.. పోలవరంలోనూ హై టెన్షన్


Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏయే నగరాల్లో ఎంత తగ్గిందంటే...


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి