AP Omicron Cases: ఏపీలో ఒమిక్రాన్ కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో రోజురోజూకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases in AP) నమోదయ్యాయి. యూఎస్‌ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. గుంటూరు మహిళతో పాటు మరో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసుల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ను (Omicron) గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి..  గత 24 గంటల్లో 58,097 కేసులు (Corona cases in india) వెలుగుచూశాయి. వైరస్ తో 534 మంది ప్రాణాలు (COVID-19 Death in India) కోల్పోయారు. ఇదిలా ఉండగా మరోవైపు 15,389 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉంది. దేశంలో 2,14,004 యాక్టివ్ కేసులు (Corona Active cases in india) ఉన్నాయి. ఇప్పటి వరకు 147.72 కోట్ల టీకా డోసుల పంపిణీ చేశారు. 


Also Read: Andhra Pradesh: పాఠశాలలో కరోనా కలకలం...టీచర్ సహా 19 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్!


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో...తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్ (Sunday Lockdown in Tamilnadu) అమలుచేయాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 'సండే లాక్‌డౌన్' అమలులోకి రానుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వీకెండ్ లాక్‌డౌన్ అమలులో ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి