ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ రకాల పింఛన్ల పథకాన్ని పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. ఐతే ముందుగా  గత ప్రభుత్వం నుంచి వరుసగా ఇప్పటికీ తీసుకున్న లబ్దిదారుల జాబితాను సరి చేయాలని నిర్ణయించింది. ఇందులో కొన్ని అవకతవకలు ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం భావించడమే ఇందుకు కారణం. దీంతో దాదాపు 4 లక్షల 27 వేల మంది పెన్షన్ దారులను అర్హత జాబితా నుంచి తొలగించారు. వారందరికీ అర్హత లేదని నిర్ణయించిన తర్వాత తీసి వేశారు. ఈ నేపథ్యంలో కాస్తంత గందరగోళం నెలకొంది.  


మరోవైపు కొత్త లబ్దిదారులను ఎంపిక చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. కొత్తగా దాదాపు 6 లక్షల మంది లబ్ది దారులను ఎంపిక చేసి పింఛన్లు అందిస్తామన్నారు. పింఛన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు చేసుకోవాలని ఆయన సూచించారు. అంతే కాదు .. అర్హత ఉన్న వారికి .. కొత్తగా దరఖాస్తు చేసుకున్న తర్వాత వారం రోజుల్లోనే పింఛన్లు అందించేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అర్హత లేని వారినే లబ్దిదారుల జాబితా నుంచి తొలగించామని చెప్పుకొచ్చారు.