తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఐతే ఓ రకంగా చెప్పాలంటే.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే..కేసుల  సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు  తీసుకుంటున్న చర్యలే కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారిపై జగన్ సర్కారు సీరియస్‌గా దృష్టిసారించింది. కేసులు పెరగకుండా ఉండేందుకు వీలైనంత ఎక్కువగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. నిన్నటికి నిన్న 10 వేల 240 శాంపిల్స్‌ను పరీక్ష చేసినట్లు ఆరోగ్యాంధ్రప్రదేశ్ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఐతే గత 24 గంటల్లో 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల 671కి చేరుకుంది.



నిన్న ఒక్కరోజే 41 మంది కరోనా వైరస్‌కు చికిత్స తీసుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 1848కి చేరుకుంది. మరోవైపు కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 56 మంది మృతి చెందారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 767 మంది ఇప్పటికీ కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..