కొత్త అల్లుడు అంటే ఎలా చూసుకుంటారో తెలుగు రాష్ట్రాల వారికి తెలిసిందే. ముఖ్యంగా కొత్త అల్లుడికి కావాల్సిన విందు కోసం (Lunch for Andhra son-in-law) చాలా ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఓ ఆంధ్రా అత్తగారు తన అల్లుడు కోసం చేసిన ప్రత్యేక విందు ఏర్పాట్లను చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ అత్త వంటలు, అల్లుడు విందు టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం, వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లుడు కోసం 5, 10 రకాలు కాదు ఏకంగా 67 రకాల వంటకాలు (67 food items lunch) సిద్ధం చేశారు. రండి రండి రండి దయచేయండి అంటూ అత్తగారు అల్లుడిని ఆహ్వానించారు.  స్టార్టర్స్, దాదాపు 8 రకాల ఛాట్, మింట్ జ్యూస్‌తో పాటు ఎన్నో రకాల స్వీట్లు సిద్ధం చేశారు. ఆఖరికి గిఫ్ట్‌గా 5 గ్రాముల బంగారాన్ని ఓ స్వీటులో ఉంచారు. అల్లుడి గారి విందు మెనును కూడా చివర్లో చూపించారు. అనంత్ రూపనగుడి అనే నెటిజన్ తన ట్విట్టర్‌లో ఈ విందు పదార్థాలకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయగా భారీ స్పందన లభిస్తోంది.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్ 



వంటల సంగతి సరే అత్తగారు.. ఇంతకీ తిన్నాక అల్లుడుగారు ఏమైపోతారోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ అల్లుడు చాలా లక్కీ అని, తమకు ఆ ఛాన్స్ రాలేదని కొందరు అల్లుళ్లు స్పందిస్తున్నారు. భోజనం వరకు ఓకే గానీ బంగారాన్ని కూడా తింటే ఏంటి సంగతంటూ ఛలోక్తులు విసురుతున్నారు.



మరికొందరైతే వచ్చే జన్మలో కచ్చితంగా ఇక్కడి అల్లుడిగా పుడతానని చెబుతున్నారు. ఆమె అల్లుడిని జాతీయ అల్లుడు (Nation's Son-in-Law) గా, దేశానికి అత్త (Mother-In-Law India)గా ఆమెను ప్రకటించాలంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు.



  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos