ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు గృహనిర్మాణశాఖ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పక్కా ఇళ్ల నిర్మాణం పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 5 లక్షల 80 వేల ఇళ్ల నిర్మాణం పూర్తియిందని అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ  దీనికి సంబంధించిన సామూహిక గృహ ప్రవేశాలకు సంబంధించిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జులై 5వ తేదీన 3 లక్షల ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు..


సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే జనవరి నాటికి మిగిలిన 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతినెలా 35 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 2022 కల్లా రాష్ట్రంలో అందరికీ పక్కా ఇళ్లు ఉండడాన్న లక్ష్యాన్ని చేరుకోల్సి ఉందని చంద్రబాబు వివరించారు. గృహనిర్మాణం కోసం ప్రైవేటు భూముల కొనుగోళ్లకు రూ.750కోట్లు కేటాయించామన్నారు....అందులో ఎస్సీలకు రూ.250 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామన్నారు