ACB Raids: ఉద్యోగం గ్రేడ్ 1 పంచాయితీ కార్యదర్శి. ఆస్థులు మాత్రం కోట్లు దాటేశాయి. పట్టుబడిన ఆస్థులొక్కటే 50 కోట్లు దాటి ఉంటాయని అంచనా. ఏసీబీ దాడుల్లో  పట్టుబడిన అతను ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం(Srikakulam)జిల్లా పైడి భీమవరం పంచాయితీ కార్యదర్శి , రణస్థలం మండల గ్రేడ్ 1 పంచాయితీ కార్యదర్శి ఆగూరు వెంకట్రావు నివాసంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో(ACB Raids)నిర్ఘాంతపోయే ఆస్థులు వెలుగుచూశాయి. ఆదాయానికి మించి ఆస్థులున్నాయనే సమాచారం మేరకు అతనితోపాటు అతని కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 35 లక్షల 67 వేల 100 రూపాయల నగదు, 669 గ్రాముల బంగాలు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగానే కాకుండా ఇన్‌చార్జి ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న వెంకటరావుతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోని రామా టాకీస్‌ డౌన్‌లోని వెజిటబుల్‌ మార్కెట్‌ వద్ద ఉన్న సువర్ణ రెసిడెన్సీలో రెండో అంతస్తులో వెంకటరావు నివాసం ఉంటున్న 202 ప్లాట్‌లో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్రమాస్తుల విలువ 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే అతని ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర సుమారు 50 కోట్ల( 50 crore assets)వరకు ఉంటుందని అంచనా. 


Also read: Tirupati Bypoll: ప్రశాంతంగా ప్రారంభమైన తిరుపతి ఉపఎన్నిక పోలింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboon