Actress Roja political career from telugu films to AP cabinet minister post: సినిమా-క్రీడలు, సినిమా-రాజకీయంకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా సినిమా-రాజకీయంకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో స్టార్ అయిన వారు రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణమే. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. ఒకప్పటి స్టార్లు ఎన్టీఆర్, వినోద్ ఖన్నా, సునీల్ దత్ నుంచి సీనియర్ హీరోయిన్ రోజా వరకు కొనసాగుతూనే ఉంది. నేడు ఏపీ మంత్రిగా రోజా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నేపథ్యంలో సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన స్టార్లను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజా తెలుగు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. శోభన్ బాబు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగతిబాబు, శ్రీకాంత్, వినోద్ కుమార్ లాంటి హీరోలతో జతకట్టారు. రోజా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే.. టీడీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత వైసీపీలోకి వచ్చి రోజా తన డ్రీమ్ ఎమ్మెల్యే పదవిని దక్కించుకున్నారు. వైసీపీ తరపున తన వాయిస్ బలంగా వినిపించడంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మంత్రి పదవి కోసం ఆమె మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. చివరకు ఈరోజు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. 


సినిమాల్లో కొన్ని దశాబ్ధాల పాటు అగ్ర హీరోగా వెలుగొందిన నందమూరి తారక రామారావు.. రాష్ట్ర ప్రజల కోసం రాజకీయ అరంగేట్రం చేసారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చారు. ఉమ్మడి ఏపీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసారు. దివంగత దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా పని చేశారు. 


మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలు వదిలి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో మాదిరిగా అయన రాజకీయ రంగంలో సక్సెస్ కాలేదు. కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసి కొన్నాళ్లు మన్మోహన్ సింగ్ క్యాబినేట్‌లో మంత్రిగా పని చేసారు. టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ ఉమ్మడిఏపీలో చంద్రబాబు నాయుడు క్యాబినేట్‌లో కార్మిక శాక మంత్రిగా పని చేసారు. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారమల్లి శివప్రసాద్.. చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు.  


వీరే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా పలువురు స్టార్లు రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యంగా దివంగత నేత ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లో తన ముద్ర వేశారు. అన్నాడిఎంకే పార్టీ స్థాపించి కనుమూసేంత వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఎంజీఆర్ అనంతరం అన్నాడిఎంకే పగ్గాలు అందుకున్న దివంగత నాయకురాలు జయలలిత రెండున్నర దశాబ్ధాల పాటు తమిళనాట ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా చక్రం తిప్పారు. బాలీవుడ్‌లో స్టార్ శత్రుఘ్న సిన్హా బిజేపీ అధికారంలో వాజ్‌పేయ్ మంత్రి వర్గంలో పనిచేశారు. ముంబై నుంచి సునీల్ దత్ ఏకంగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. నెపోలియన్, అంబరీష్, వినోద్ ఖన్నా, స్మృతి ఇరానీ లాంటి స్టార్లు కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 


Also Read: Vijay Thalapathy: ఆ ఒక్క సంఘటనతో 11 ఏళ్లు మీడియాకు దూరమయ్యా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న బీస్ట్‌ హీరో!


Also Read: Karthikeya 2: కార్తికేయ -2 రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook