ఐదేళ్ల తర్వాత మరోసారి ప్రధాని మోడీ తిరుపతిలో మళ్లీ అడుగు పెడుతున్నారు. జూన్ 9న శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. ఈ మేరకు ఆయన పర్యటకను సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం..సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ ....వెంకన్న సాక్షిగా  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిన తీరుతామని హామీ ఇచ్చారు. అనంతరం మోడీ 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కానీ.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ మాత్రం అలాగే ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఫలితంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొవాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారైనా కరుణించేనా...?


గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశంమే ప్రధానంగా పనిచేసిన విషయం తెలిసిందే. తమ తొలి ప్రాధాన్యత ప్రత్యేక హోదా అని చెప్పి జగన్ అధికారంలో వచ్చారు. అదే క్రమంలో ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించిన బీజేపీ దారుణ పరాజయం ఎదుర్కొవాల్సి వచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ప్రత్యేక హోదా ప్రకటన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రకటన చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా పరిణామంతో ప్రత్యేక హోదాపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.