AP Congress: ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన, కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం
AP Congress: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యాక..పార్టీ ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పుడాయన ఏపీపై దృష్టి సారించారు. కొత్త సారధుల్ని నియమించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకు కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. రాష్ట్ర పీసీసీ ఛీఫ్‌గా గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. అటు హర్షకుమార్‌కు సైతం కీలక పదవి లభించింది.
ఏపీ కాంగ్రె స్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల కమిటీలపై దృష్టి సారిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీపై దృష్టి సారించిన మల్లికార్జున ఖర్గే పార్టీలోపెద్దఎత్తున మార్పులు చేశారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను పీసీసీ పదవి నుంచి తప్పించి..కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజును నియమించారు.
హర్షకుమార్, పల్లంరాజులకు కీలక పదవులు
18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీ నియామకం జరిగింది. పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను నియమించారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షులుగా మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, రాకేష్ రెడ్డి ఉంటారు. పార్టీ కార్యక్రమాల్ని అమలు చేసే కమిటీ ఛైర్మన్‌గా మాజీ మంత్రి పల్లంరాజు ఉంటారు. ఇక తులసిరెడ్డికి సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా నియమించారు.
శైలజానాధ్‌ను ఎందుకు తప్పించారు
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను తొలగించడం వెనుక రాజకీయ కారణాలు కన్పిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో తెలుగుదేశంకు సన్నిహితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. పార్టీని బలోపేతం చేసేకంటే..టీడీపీకు మద్దతుగా మాట్లాడటంలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారనే వాదన ఉంది. అదే సమయంలో గిడుగు రుద్రరాజు సమర్ధుడనే భావనతో పాటు పార్టీకు విదేయుడిగా ఉన్నారు.
ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన గిడుగు రుద్రరాజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సౌమ్యుడు, వివాహ రహితుడిగా పేరుంది. పార్టీలో సీనియర్ నేత. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో పాటు కేవీపీకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన గిడుగు రుద్రరాజు..పార్టీకు అత్యంత విధేయుడు.
Also read: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి సరికొత్త బస్సులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook