Vijayawada Airport: విజయవాడ విమానాశ్రయంలో భారీ ముప్పు తప్పింది. ఎయిర్ ఇండియా విమానం భారీ ప్రమాదం నుంచి బయటపడింది. 117 మంది ప్రయాణీకులు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానం విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport)నుంచి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా రన్ వేపైనే నిలిచిపోయింది. విజయవాడ నుంచి ఢిల్లీకు బయలుదేరిన ఈ విమానంలో 117 మంది ప్రయాణీకులున్నారు. సాంకేతిక సమస్య కారణంగా గంటల తరబడి రన్ వేపైనే ఉండిపోవల్సి వచ్చింది. టెక్నకల్ టీమ్ లోపాన్ని సరిజేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న ఈ ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) తిరుగు ప్రయాణం సమయంలో సాంకేతిక సమస్య కారణంగా రన్ వేపై ఆగిపోయింది. ఫలితంగా ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గరువుతున్నారు. ప్రయాణికులందర్నీ విమానాశ్రయానికి తరలించి..లోపాన్ని సరిజేస్తున్నారు. పూర్తిగా టేకాఫ్ జరిగిన తరువాత సమస్య తలెత్తి ఉంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. 


Also read: AP weather updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన : IMD reports


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook