Air Travel: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగిన విమాన ప్రయాణం
Air Travel: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విమాన ప్రయాణం గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఇతర విమానాశ్రయాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం భారీగా పెరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
Air Travel: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విమాన ప్రయాణం గణనీయంగా పెరిగిందని తెలుస్తోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఇతర విమానాశ్రయాల్లో ప్రయాణీకుల సామర్ధ్యం భారీగా పెరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో విమానాశ్రయాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు విశాఖపట్నం, విజయవాడలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప నగరాల్లో దేశీయ విమానాశ్రాలున్నాయి. ఇందులో ఒక్క కడప మినహాయించి మిగిలిన విమానాశ్రయాల్లో విమాన ప్రయాణీకుల సామర్ధ్యం గణనీయంగా పెరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్(Hyderabad Airport)అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల సంఖ్య రెండు రెట్లు పెరగగా, స్వదేశీ ప్రయాణాలు 53 శాతం అభివృద్ధి చెందాయి. ఇక తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 99 శాతం పెరిగిందని తెలుస్తోంది. ఇక విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు విమానాశ్రయాల్లోనూ ఆశించినస్థాయిలోనే విమాన ప్రయాణీకుల సంఖ్య పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్నించి విమాన ప్రయాణీకుల సంఖ్య అక్టోబర్ నెలలో 6 లక్షలు పెరిగింది. 2020 అక్టోబర్ నెలలో 10 లక్షల 30 వేల 975 మంది ప్రయాణీకులుండగా, 2021 అక్టోబర్ నెలలో 16 లక్షల 27 వేల 807 మందికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు ప్రయాణీకుల సంఖ్య రెట్టింపైంది.
విమానాశ్రయం 2020 అక్టోబర్ 2021 అక్టోబర్
హైదరాబాద్ 50 వేల 627 1 లక్షా 53 వేల 39
విజయవాడ 43 వేల 625 55 వేల 431
విశాఖపట్నం 1,16 వేల 502 1 లక్షా 69 వేల 544
తిరుపతి 29 వేల 978 59 వేల 701
రాజమండ్రి 21 వేల 601 26 వేల 428
ఇవి కాకుండా కర్నూలు, కడప విమానాశ్రయాలతో కలుపుకుని గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ 31 లక్షల 49 వేల 615 మంది స్వదేశీ ప్రయాణాలు చేయగా, ఈ ఏడాది ఏడు నెలల్లో 65 లక్షల 51 వే 990 మంది ప్రయాణించారు. అంతర్జాతీయ విమాన రాకపోకలు 68 శాతం పెరగగా, స్వదేశీ రాకపోకలు 43 శాతం పెరిగాయి. ఇక దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలు 2020 అక్టోబర్ నెలల 1 లక్షా 18 వేల 531 కాగా, ఈ ఏడాది 1 లక్షా 72 వేల 948 ట్రిప్పులు పెరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వైమానికయానం పెరగడం రానున్న కాలంలో ఏపీ, తెలంగాణల్లో వైమానికరంగం మరింత అభివృద్ధి చెందే అవకాశముందని తెలుస్తోంది.
Also read: CycloneJawad : ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ఉన్న జవాద్.. ఇవాళ రాత్రికల్లా బలహీనపడనున్న తుపాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి