Mandapam Collapse: శివ శివా.. మహాశివరాత్రి వేడుకల్లో అపశ్రుతి.. శ్రీశైలంలో కూలిన మండపం
Akka Mahadevi Mandapam Collapse: మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ప్రఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఓ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
SriSailam Incident: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో ముఖ్య ఘట్టమైన మహా శివరాత్రి రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతరలో ఏర్పాటుచేసిన మండపం కుప్పకూలింది. జాతరలో కీలక ఘట్టమైన 'పాగాలంకరణ' వేళలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: Medaram Hundi: మేడారం జాతరకు కానుకల వెల్లువ.. కాసుల వర్షం.. గతం కంటే అత్యధికంగా ఆదాయం
మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఘట్టం 'పాగ అలంకరణ ఉత్సవం'. మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయ గోపురాలకు పాగను అలంకరించడం ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. శుక్రవారం రాత్రి పాగాలంకరణ చేస్తున్న సమయంలో అక్క మహాదేవి అలంకార మండపం కూలింది. పాగాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్ద ఎత్తున మండపం రేకుల షెడ్డుపైకి ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో రేకులు బరువుకు తాళలేక కూలిపోయాయి. మండపం కూలడంతో రేకులపై నిలబడ్డ భక్తులు కిందపడ్డారు. అయితే ప్రమాదంలో ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. స్వల్ప గాయాలైన భక్తులను వెంటనే అక్కడి పోలీసులు, అధికారులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పాగా అలంకరణ కార్యక్రమం యథావిధిగా కన్నులపండువగా జరిగింది.
Also Read: Tirumala: వేసవికి కుటుంబంతో తిరుమల వెళ్తున్నారా..? వచ్చే నాలుగు నెలలు ఇవే ప్రత్యేక సేవలు
గత నెలాఖరున మొదలైన శ్రీశైల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండడంతో శ్రీగిరులు భక్తకోటితో తరిస్తున్నాయి. మహా శివరాత్రి వేడుకల కోసం శ్రీశైలం క్షేత్రానికి తెలంగాణ, ఏపీ నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుండగా భక్తుల అత్యుత్సాహంతో కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా జరిగిన ప్రమాదం అదే కోవలోకి వస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి