AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీపైనే అందరి కళ్లు.. ఎన్నికల వేళ సీఎం జగన్ మదిలో ఏముంది?
All Eyes on Cabinet Meeting: కొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ అవుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ సీఎం జగన్ ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా.. ప్రజలకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు పార్లమెంట్ స్థానాలను తిరిగి చేజిక్కించుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ వ్యూహం రచించారు. భీమిలి 'సిద్ధం' సభతో ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించారు. ఈ క్రమంలో ఈనెల 31వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల ప్రకటనకు ముందు నిర్వహించే ఈ సమావేశంపై అందరి దృష్టి పడింది. బహుశా ఈ మంత్రివర్గానికి ఇదే చివరి సమావేశం కూడా కావొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఎన్నికల ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది.
చివరి మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అమలుచేస్తున్న పథకాలకు తోడు మరికొన్ని పథకాలు అమలు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా వస్తుండడంతో ప్రజలను ఆకర్షించుకునేందుకు కొంత తాయిలాలు ప్రకటించక తప్పని పరిస్థితి. ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా ఉండడంతో దాన్ని అధిగమించేందుకు ఏదైనా పథకం ప్రకటిస్తే బాగుంటుందనేది అందరి నోట వినిపిస్తున్న మాట.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. రైతులకు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులకు కూడా తీపి కబురు వినిపించేలా ఉంది.
కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ఇచ్చే యోచనపై చర్చిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో, డీఎస్సీ నోటిఫికేషన్, అసెంబ్లీ సమావేశాలు, జగనన్న కాలనీలపై చర్చ జరిగే ఆస్కారం ఉందని తాడేపల్లి నుంచి వస్తున్న వార్త.
ఇక తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణంగా నిలిచిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కూడా సీఎం జగన్ మదిలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం లేకపోలేదు. జిల్లా పర్యటనలు, ఎన్నికల కార్యచరణ ప్రణాళికపై సహచర మంత్రులతో సీఎం చర్చిస్తారని వినిపిస్తున్న మాట.
ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం కూడా కావడంతో వచ్చే నెల రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తుండడంతో సీఎం జగన్ భారీ నిర్ణయాలే తీసుకునే అవకాశం ఉంది.
Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్ లేదబ్బా
Also Read: Bottole Thrash: 'బాటిల్' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి