TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ  ప్రతిష్టాత్మకంగా భావించే మహానాడుకు సర్వం సిద్ధమైంది. టీడీపీ పండుగకు ఒంగోలు మండువవారిపాలెంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మహానాడుతో ఒంగోలు నగరమంతా పసుపుమయంగా మారింది. నగరంలోని ప్రధాని రోడ్ల వెంట స్వాగత ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒంగోలులోకి ఎంటరయ్యే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహానాడుకు వచ్చేవారికి స్వాగతం చెబుతూ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. జాతీయ రహదారిపై మంగమ్మ కాలేజీ నుంచి మహానాడు ప్రాంగణం వరకు కట్టిన పసుపు తోరణాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహానాడులో మొత్తం 17 అంశాలపై తీర్మానం చేయనున్నారు. మహానాడులో చేయబోయే తీర్మానాలకు గురువారం సాయంత్రం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఆమోదించారు. 17 తీర్మానాల్లో ఏపీకి సంబంధించినవి 12 కాగా.. మూడు తీర్మానాలు తెలంగాణ రాష్ట్రానవి. అండమాన్ కు సంబంధించి ఒక తీర్మానం చేయనున్నారు. వీటితో పాటు అత్యంత కీలమైన రాజకీయ తీన్మానం ఉండనుంది. మహానాడులో తీర్మానాలపై దాదాపు 50 మంది నేతలు మాట్లాడే అవకాశం ఉంది. తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడులో చర్చలు సాగాలని పార్టీ సీనియర్ నేతలు పొలిట్ బ్యూరో సమావేశంలో చెప్పారు. రాజకీయ తీర్మానంలో ఈసారి కీలక అంశాలు ఉంటాయని తెలుస్తోంది.


ఏపీలో పొత్తులపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ఇటీవలే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కామెంట్ చేశారు. పవన్ ప్రకటన తర్వాత పొత్తులపై జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు కూడా నియంత పాలనకు చెక్ పెట్టేందుకు త్యాగాలకు సిద్ధమనే సంకేతం ఇచ్చారు. దీంతో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. దీంతో జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయా లేక.. బీజేపీకి హ్యాండిచ్చి టీడీపీతో జనసేన జత కలుస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. మహానాడులో చేయబోయే రాజకీయ తీర్మానంలో పొత్తులకు సంబంధించి చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.


వైసీపీ తలపెట్టిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర  నాటకమని చెబుతున్న టీడీపీ.. దీనిపైనా రాజకీయ తీర్మానంలో మాట్లాడే అవకాశం ఉంది. రాజ్యసభ సీట్ల ఎంపికపైనా విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్లకే సీట్లు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో 12 బీసీ కులాలను బీసీల జాబితా నుంచి తొలగిస్తే నోరెత్తని ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కృష్ణయ్య కోర్టుకు వెళ్లి అడ్డుపడ్డారని గుర్తు చేస్తున్నారు. పెద్దల సభకు వెళ్లేందుకు ఏపీలో బీసీ నేతలే లేరా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపైనా మహానాడులో చర్చించనున్నారు టీడీపీ నేతలు. మరోవైపు మహానాడులో  రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల ప్రస్తానం చాటుతూ ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. మహానాడుకు హాజరయ్యే కార్యకర్తల కోసం రుచికరమైన వంటకాలు సిద్దం చేశారు.  


READ ALSO: PM MODI TOUR: డుమ్మా కొట్టిన కేసీఆర్.. గళమెత్తిన స్టాలిన్! ప్రధాని పర్యటనలో ఇద్దరు సీఎంల తీరుపై చర్చ.. 


READ ALSO: Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook