Maha Padayatra : ఏపీలో రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం
Maha Padayatra Amaravati to Tirumala : అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం వరకు యాత్ర సాగనుంది.
Amaravati farmers 45day Maha Padayatra Amaravati to Tirumala started: ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర (Maha Padayatra ) నేటి నుంచి (సోమవారం) కొనసాగుతోంది. అమరావతి పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభమైంది. తుళ్లూరులో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం (Thirumala Venkateswaraswamy Temple) వరకు యాత్ర సాగనుంది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగే ఈ యాత్ర మార్గమధ్యలో వచ్చే వివిధ మతాలకు చెందిన క్షేత్రాలు, ప్రార్ధనా మందిరాలను రైతులు సందర్శించి తమ గోడును వెల్లబోసుకోనున్నారు. 503.3 కి.మీ దూరం సాగనున్న ఈ యాత్రను మొదట 32 రోజుల్లో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తరువాత 45 రోజులు కొనసాగించాలని నిర్ణయించారు. ఈ యాత్రకు అనుమతి ఇవ్వడానికి తొలుత పోలీసులు (Police) నిరాకరించారు. హైకోర్టు ఆదేశాలతో ఆ తరువాత అనుమతి ఇచ్చినప్పటికీ అనేక ఆంక్షలు విధించారు.
ఒకే రాజధాని ఉండాలన్న నినాదంతో పాటు, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరుతూ స్థానిక రైతులు, మహిళలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట ఈ పాదయాత్ర సాగతోంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర సాగతోంది. ఇక డిసెంబర్ 14న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.
Also Read : AP Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం జగన్
నవంబరు 1 మొదటి రోజున తుళ్లూరు నుంచి తాడికొండ వరకు 12.9 కిలో మీటర్లు రైతులు పాదయాత్ర చేయనున్నారు. మొదటి రోజు తుళ్లూరు నుంచి తాడికొండ వరకు పాదయాత్ర సాగుతుంది. తుళ్లూరు (Tulluru) నుంచి తాడికొండ, గుంటూరు అమరావతి రోడ్డు, పుల్లడిగుంట, ఏటుకూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఒంగోలు, (Ongole) టంగుటూరు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, కోవూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, (Tirupati) అలిపిరి మార్గం గుండా తిరుమలకు (Tirumala) యాత్ర చేరుకుంటుంది.
ఇక రాజధాని రైతుల మహా పాదయాత్రకు (Maha Padayatra) టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ఆద్మీ, అమరావతి బహుజన ఐక్య సంఘం, దళిత బహుజన ఫ్రంట్ తదితర రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఏపీలో (AP) సాగే ఈ యాత్రలో నేరుగా పాల్గొంటామని వెల్లడించాయి.
Also Read : China rejects Covid Origins: కొవిడ్ మూలాలపై అమెరికా నివేదిక అంతా తప్పు- చైనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి