Amit Shah to visit Srisailam temple: అమరావతి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానం పర్యటనకు రానున్నారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా ముందుగా ఢిల్లీ నుంచి గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత బేగంపేట్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం (Hyderabad to Srisailam helicopter services) బయల్దేరి వెళ్తారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Minister Harish Rao slams Etela Rajender: ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం


అమిత్ షా శ్రీశైలం పర్యటన షెడ్యూల్ (Amit Shah's srisailam tour) ప్రకారం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడే లంచ్‌ చేసి మధ్యాహ్నం తర్వాత తిరిగి హెలికాప్టర్‌లో బేగంపేట్‌ విమానాశ్రయం చేరుకుంటారు. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి (Hyderabad to Delhi flights) వెళ్లనున్నారు. ఒక విధంగా అమిత్ షా (Amit Shah) శ్రీశైలం పర్యటనను రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనగా బీజేపి నేతలు పేర్కొంటున్నారు. 


Also read : AP COVID-19 updates: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు, 16 వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook