Raghurama Krishnam Raju shifted to Hyderabad: హైదరాబాద్‌ : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్ వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అనుమతి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ సహకారం ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అమిత్ షా అనుమతి లేకున్నా, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారం లేకున్నా, హైదరాబాద్‌లో ఉన్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజును అరెస్టు చేసే అవకాశమే లేదని నారాయణ పేర్కొన్నారు. అయితే, రఘురామరాజు తన సొంత పార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడాన్ని సైతం నారాయణ తప్పుపట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలు  చూసుకునే రఘురామ రాజు ఇలా సొంత పార్టీపై తిరుగుబాటు చేశారని నారాయణ అన్నారు. అదే సమయంలో ఆయన వైసిపీ సర్కారు వైఖరిని కూడా తప్పుపట్టారు. రాజకీయ విమర్శలు చేసే వారిపై కక్షపూరిత చర్యలకు పూనుకోవడం సరైన పద్ధతి కాదని నారాయణ వైసీపీ సర్కారుకు హితవు పలికారు.


Also read : Aarogyasri: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం


ఇదిలావుంటే, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడి పోలీసులు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఒకట్రెండు రోజుల్లో ఆర్మీ ఆసుపత్రి ఎంపీ రఘురామ రాజు వైద్య పరీక్షలపై నివేదికలు (Raghurama Krishnam Raju medical tests) వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.


Also read : Covishield 2nd Dose booking: కొవిషీల్డ్ 2వ డోస్ బుక్ చేసుకుంటున్నారా ?ఈ విషయం తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook