నేడో.. రేపో ఢిల్లీకి చంద్రబాబు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మార్చి 27 న జరిగిన అఖిలపక్ష భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అందుబాటులో ఉన్న నాయకులందరినీ కలవాలని నిర్ణయించారు.
ఢిల్లీలో ఎవరెవరిని కలవాలి? సీఎంతో పాటు వెళ్లే అఖిలపక్ష బృందంలో ఎవరెవరు ఉంటారనే దానిపైన సోమవారం పూర్తి స్పష్టత రానుంది. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లనున్నారు చంద్రబాబు. దీని కోసం సమగ్ర సమాచారంతో పవర్ పాయింట్ ప్రజంటేషన్, ప్రత్యేక నివేదికలను సిద్ధం చేశారు. వీటిని ఆయా నాయకులకు అందజేయనున్నారు.