AP Covid-19 Update: ఏపీలో తగ్గిన కరోనా కేసులు... ఒక్కరోజే 12 మరణాలు..
AP Covid-19 Update: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 10,310 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
AP Covid-19 Update: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 10,310 మందికి కరోనా పాజిటివ్ గా (Corona Cases in AP) నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 22,70,491కి చేరింది. తాజాగా వైరస్ తో 12 మంది ప్రాణాలు (Covid-19 Deaths in AP) కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 14,606కి పెరిగింది. అత్యధికంగా విశాఖపట్నంలో ముగ్గురు మృతి చెందగా..నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
కరోనా మహమ్మారి నుంచి కొత్తగా 9,692 మంది కోలుకున్నారు. దీంతో ఏపీలో కొవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 21,39,854కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,16,031 కరోనా యాక్టివ్ కేసులు (Corona Active Cases in ap) ఉన్నాయి. కడప జిల్లాలో అత్యధికంగా 1,697 కరోనా కేసులు వెలుగుచూశాయి. తర్వాత కర్నూలు జిల్లాలో 1,379, గుంటూరు జిల్లాలో 1249, కృష్ణా జిల్లాలో 1,008 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. కరోనా వైరస్ తో మరో 893 మంది మరణించారు. మహమ్మారి నుంచి 3,52,784 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టిన్ కేసులు (Active Cases in india) ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: AP PRC Issue: ఉద్యోగుల హెచ్ఆర్‌ఏ పెంచిన ఏపీ ప్రభుత్వం... ఎంత పెరిగిందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి