AP SSC Results 2024: ఏపీ పదో తరగతి ఫలితాలు రేపే, ఎలా చెక్ చేసుకోవాలంటే
AP SSC Results 2024: ఏపీ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఫలితాలు ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాలు https://Results.bse.ap.gov.in/ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్‌సి పరీక్షలకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ ఏపీ విద్యాశాఖ వెలువరించింది. పదో తరగతి పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 22 వతేదీ సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాలను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోవచ్చు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్ధులకు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో అత్యంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకూ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇక జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటరీకరణ పూర్తి చేసిన తరువాత ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూశారు. ఇప్పుడా అనుమతి రావడంతో ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.
పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కాగానే ఏ విధమైన సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నారు. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు https://Results.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. తాత్కాలిక మార్కుల మెమోను ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook