AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్ధులకు గుడ్‌న్యూస్,. ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. పదవ తరగతి విద్యార్ధులు ఏపీ విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ నుంచి సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
AP SSC Results 2024: ఏపీలో మార్చ్ 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షలమంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూుటరీకరణ వంటివి కూడా పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షలమంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 3, 17,939 కాగా బాలికల సంఖ్య 3, 05, 153గా ఉంది. గత ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మే 6న విడుదలయ్యాయి. ఈసారి ఎన్నికల సమయం కావడంతో పరీక్షలు కూడా పదిహేనురోజులు ముందే జరిగిపోయాయి. ఫలితాలు కూడా ముందే విడుదలవుతున్నాయి.
Click Here for Ap SSC Results 2024
పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ముందుగా హోం పేజిలో కన్పించే AP SSC Results 2024 క్లిక్ చేయాలి. విద్యార్ధి రోల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు స్క్రీన్ పై మీ ఫలితాలు ప్రత్యక్షమౌతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook