Heavy Rains: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం వేళ చలి తీవ్రత అధికంగా ఉండటమే కాకుండా పొగమంచు ఎక్కువగా ఉంటోంది. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇటు ఏపీలో భారీ వర్షాలు కూడా పొంచి ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావం తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువగా ఉండనుంది. తెలంగాణలో మోస్తరు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చు. అయితే వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చు. నిన్న మెదక్ లో కనిష్టంగా 11.8 డిగ్రీలు నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 3-5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. అటు హైదరాబాద్‌లో కూడా నిన్నటి నుంచి చలి ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షసూచన లేదు. 


ఇక ఏపీలో మాత్రం భారీ వర్షాలు పడనున్నాయి. హిందూ మహాసముద్రంలోని దక్షిణ అండమాన్ సముద్రంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఉంది. దాంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఇవాళ ఏర్పడనుంది. ఇది రానున్న 2-3 రోజుల్లో వాయుగుండంగా బలపడి ఆ తరువాత తుపానుగా మారనుంది. దాంతో మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో కూడా భారీ వర్షాలు పడవచ్చు. పంట కోతల విషయంలో అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నెలాఖరుకు వాయుగుండం తుపానుగా మారవచ్చని అంచనా. ఫలితంగా ఈ నెలాఖరులో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 


Also read: Inturi Ravikiran: సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.