AP Assembly Budget Session 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళప్రారంభం కానున్నాయి. ముందుగా శాసనసభ, మండలి సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం కీలకమైన బీఏసీ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చిస్తారు, అజెండా ఏంటి, సమావేశాలు ఎన్ని రోజులుంటాయనే వివరాలు బీఏసీ సమావేశంలో నిర్ణయమౌతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. ముందుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత సభ వాయిదా పడుతుంది. తరువాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సెషన్‌లో ఏయే అంశాలపై చర్చ జరుగుతుంది, ఎన్నిరోజులు అసెంబ్లీ నిర్వహిస్తారనే వివరాలు నిర్ణయిస్తారు. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 సంవత్సరం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ అయినందున ఏప్రిల్-జూన్ వరకు కొత్త పథకాల ప్రస్తావన ఉండకపోవచ్చు. జూన్ వరకూ ఉన్న పధకాల కొనసాగింపు, నిర్వహణ వ్యయాలపైనే బడ్జెట్ ఉంటుంది. 7వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరగనుంది. 


మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు రాతపూర్వక సమాధానం ఇచ్చేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం విధించిన గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఈ నెవ 8వ తేదీన ఈ నలుగురితో పాటు టీడీపీ-జనసేన నుంచి వైసీపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేల భవితవ్యంపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. 


Also read: TDp-Janasena Alliance: జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు లెక్క 25 లేదా 40, ఏది ఫైనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook